పైన ఉన్న ఫొటోలోని చిన్నారిని చూసారా? ఒక ఖాళీ గిన్నె ని చేతిలో పట్టుకొని ఓ తరగతి ఎదుట నిల్చొని విద్యార్థుల వైపు దీనంగా చూస్తున్న ఈ పాపని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లోని దేవల్ జామ్ సింగ్ ప్రభుత్వ పాఠశాల మురికివాడలలో ఉండడంతో.. ఓ ప్రముఖ వార్త ప్రతికకు చెందిన ఒక ఫోటో జర్నలిస్ట్ ప్రస్తుత డెంగ్యూ వ్యాప్తి ని ఉద్దేశించి ఆ పాఠశాలలో ఉన్న సదుపాయాలను, శుభ్రతని ఫోటో తీయడానికి వెళ్ళాడు. ఈ సందర్భంలోనే ఓ చిన్నారి ఒక ఖాళీ గిన్నె ను పట్టుకొని నడుచుకుంటూ వెళ్లి ఒక తరగతి ముందు నిల్చొని విద్యార్థుల వైపు దీనంగా చూస్తుంది. దీన్ని గమనించిన ఆ ఫోటో జర్నలిస్ట్ ఈ చిన్నారిని ఒక ఫోటో తీసాడు. 


ఆ బాలిక ఎవరు ఏమిటి అని ఆ ఫోటో జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆమె గుడిమల్కాపూర్‌, జాంసింగ్‌ గుడిసెలు (బుడగ జంగం బస్తీ)కి చెందిన మోతి దివ్య గా తెలిసింది. ఇంకా.. ఈ అమ్మాయి ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని కానప్పటికీ అక్కడికి ప్రతిరోజు మధ్యాహ్నం.. ఇంకా ఆహార విరామంలో వచ్చి వెళ్తుంది. ఎందుకంటే... లంచ్ టైం లో విద్యార్థులు తినగా మిగిలిన ఆహారం తో ఈ బాలిక తన ఆకలిని తీర్చుకుంటుందట. 


ఇది తెలుసుకున్న ఆ ప్రముఖ వార్త ప్రతీక 'ఆకలి చూపు' అనే శీర్షికతో దివ్య పాఠశాల వద్ద పట్టెడన్నం కోసం ఇలా దీనంగా ఎదురుచూపులు చూస్తుందని గురువారం రోజు ఈ చిత్రంను ప్రచురించింది. దీంతో ఈ ఫోటో సామజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయింది. చివరికి ఈ చిత్రాన్ని చూసి ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ జాతీయ కన్వీనర్ వెంకట్ రెడ్డి చలించిపోయారు. 


వెంటనే దివ్య నివసించే స్థలం..తన తల్లిదండ్రులు గురించి పూర్తిగా వివరాలు తెలుసోకమని వెంకట్ రెడ్డి తన కోఆర్డినేటర్ ని పంపించాడు. ఆ బాలిక తల్లిదండ్రులు చెత్త వేరుకునే వారని తెలుసుకున్న వెంకట్ రెడ్డి తన టీమ్ తో సహా దివ్య నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి ఆ పాఠశాలలో చేర్చుకుని చదివే హక్కు, ఆహార హక్కు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఆ చిన్నారి పేరెంట్స్ తో మాట్లాడి స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించాడు వెంకట్ రెడ్డి. ఈ విషయాన్నీ తన ఫేసుబుక్ పోస్ట్ ద్వారా.. ఇకపై దివ్య చదువుకుంటూనే కడుపు నిండా తినగలదు అంటూ తెలియచేసాడు. చూసారా?? ఆ ఫోటో జర్నలిస్ట్ తీసిన ఒక్క చిత్రం ఆ బాలిక జీవితాన్ని ఎలా మార్చేసిందో. ఇదంతా తెలుసుకున్న మనం దివ్య భవిషత్తు బాగుండాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: