తన పోలికలతో లేడన్న కారణంగా  ఓ చిన్నారిని కన్న తండ్రి నేలకేసి కొట్టి అత్యంత   దారుణంగా హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది.  తన  బిడ్డ కు తన పోలికలు లేవన్న కారణంగా  నేలకేసి కొట్టి , ఆపై చిన్నారి గొంతుమీద కాలేసి తొక్కిన పసివాడి ప్రాణం ప్రాణం తోడేశాడు మానవత్వం లేని ఓ  తండ్రి . కడప జిల్లా రామాపురం కి చెందిన రమాదేవితో రాచర్ల కు చెందిన గుమ్ముల చిన్న పుల్లయ్యకు 2017 లో వివాహం జరిగింది.  వీరిది రెండో వివాహం.  వీరికి ఎనిమిది నెలల కుమారుడు రేవంత్ ఉన్నాడు.


 బిడ్డ పుట్టినప్పటి నుంచి తన పోలికలతో లేడని నిత్యం భార్యను వేధింపులకు గురి చేసే వాడు  చిన్న పుల్లయ్య.  శుక్రవారం రాత్రి ఇదే విషయమై మళ్లీ భార్యని వేధించాడు.  శనివారం ఉదయం కూడా భార్యతో ఘర్షణకు దిగాడు.  ఈ క్రమంలో ఒక్కసారిగా మంచం పై ఉన్న రేవంత్ ను తీసుకొని నేలకేసి కొట్టాడు.  అది చాలదన్నట్లు గొంతుపై కాలుపెట్టి తొక్కి  హతమార్చాడు.  కన్నబిడ్డను కళ్ళముందే చంపేస్తుండడం తో రమాదేవి, కేకలు వేస్తూ ఇరుగుపొరుగు పిల్చింది .  దీంతో మరింత రెచ్చిపోయిన పుల్లయ్య  పక్కనే ఉన్న రోకలిబండ ను అందుకుని  ఆమె తలపై బలంగా మోదాడు.  తీవ్ర గాయాలతో  కేకలు వేస్తూ వీధిలోకి వచ్చి రమాదేవి  కుప్పకూలిపోయింది.  బిడ్డ అప్పటికే మరణించడంతో పుల్లయ్య అక్కడి నుంచి  పరారయ్యాడు.


 ఇరుగుపొరుగు వచ్చి రక్తం మడుగులో పడిఉన్న రమాదేవిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు రిమ్స్ కు తరిలించారు .  పుల్లయ్య మొదటి భార్యను కూడా హత్య చేసి జైలుకు వెళ్లి ఏడేళ్లు జైలు జీవితం అనుభవించాడు .  


మరింత సమాచారం తెలుసుకోండి: