అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టీస్ పదవికి రంజన్ గోగోయ్ పదవి విరమణ చేయనున్న  విషయం తెలిసిందే. అంటే చీఫ్ జస్టిస్ గా ఉన్న రంజన్ గొగోయ్ కి మిగిలింది సోమవారం నుంచి ఒక వారం రోజులు మాత్రమే . కాగా ఇప్పటికే ఎన్నో కీలక కేసుల్లో  తీర్పును వెలువరించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్... తాజాగా మూడు దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్న అయోధ్య భూవివాదం పై కూడా నిన్న కీలక తీర్పును వెలువరించారు. కాగా జస్టిస్ రంజన్ గొగోయ్  ముందు మరో నాలుగు కీలక కేసులు ఉన్నాయి. నాలుగు కీలకమైన కేసులను కూడా ఆయన తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే నిజానికి రంజన్ గొగోయ్ పదవి విరమణకు  వారం పాటు సమయం ఉన్నప్పటికీ వారంలో సుప్రీంకోర్టు పనిచేసేది మూడు రోజులు మాత్రమే. అయితే మూడు రోజుల్లో నాలుగు కేసులకు తీర్పులు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. నవంబర్ 11,12, 16 తేదీల్లో సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి... కేవలం 13,14, 15 తేదీల్లో మాత్రమే తీర్పులు వెలువరించ డానికి అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రం తన పదవి విరమణ పొందే లోపు ఈ నాలుగు కేసులకు  కూడా తీర్పు వెలువరించాలని  అని భావిస్తున్నట్లు తెలుస్తుంది . 



 ఇంతకీ ఆ నాలుగు కేసులు ఏంటంటే... ఒకటి శబరిమల తీర్పు... శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని  వయసుల  మహిళలు ప్రవేశించడానికి వీలు  ఉందంటూ  2008 సెప్టెంబర్ లో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది... సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ లు  వచ్చాయి... కాగా  ఈ రివ్యూ  పిటిషన్లపై విచారణ.. తర్వాత రివ్యూ పిటిషన్లపై  సుప్రీంకోర్టు సరే అంటుందా  లేక  ఇంతకు ముందు ఇచ్చిన తీర్పునే  కరెక్ట్ అని అంటుందా  అనేది తేలాల్సి ఉంది. ఇక రెండవది రఫెల్ డీల్.. రఫెల్  డీల్ ని  సమర్థిస్తూ 2018 డిసెంబర్ లో  సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరీ,  యశ్వంత్ సిన్హాప్రశాంత్ భూషణ్ రివ్యూ  పిటిషన్లు దాఖలు చేశారు. కాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ దీనిపై కూడా తీర్పు వెలువరించనున్నారు . ఇక మూడోది meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి లేఖి పిటిషన్.... గతంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై లేకి పిటిషన్ దాఖలు చేశారు. చౌకీదార్ చోర్ హై అని ఎన్నికల ప్రచారంలో రాహుల్ అన్నారని పిటిషన్ దాఖలైంది... అయితే దీనిపై రాహుల్ గాంధీ క్షమాపణలు  చెప్పినప్పటికీ కేసు అలాగే ఉండిపోయింది. కాగా  దీని పై కూడా తీర్పు వెలువరించాల్సి ఉంది. 



 ఇక నాలుగోది ఆర్బిఐ పరిధిలోకి సీజేఐ... సమాచార హక్కు చట్టంలోకి  అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ను తేవాలా వద్దా అన్నదానిపై ఏప్రిల్  4న రిజర్వ్ చేసారు ఇక దీనిపై కూడా తీర్పు వెలువడనుంది  . కాగా  ఈ మూడు రోజుల్లో ఈ 4 కేసుపై కూడా తీర్పు వెలువడనుంది. అయితే కేవలం 3 రోజుల్లో 4 కేసులకు తీర్పు వెలువరించడం కష్టతరమైనప్పటికీ ... ఇప్పటికే ఎన్నో  కీలక కేసుల్లో  తీర్పును వెలువరించిన జస్టిస్ రంజన్ గొగోయ్ కి ఈ 4  కేసులకు  తీర్పును వెలువరించడం పెద్ద కష్టం ఏమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: