ఎన్నో దశాబ్దాలుగా రగులుతున్న  వివాదానికే సుప్రీంకోర్టు చిక్కుముడి విప్పిన విషయం తెలిసిందే. 30 సంవత్సరాలుగా రగులుతున్న వివాదం  సుప్రీంకోర్టు తీర్పుతో  చల్లారినట్లైంది. వివాదాస్పద అయోధ్య వివాదం పై సంచలన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించింది. దీంతో కొన్ని దశాబ్దాల పాటు రగులుతున్న వివాదానికి తెర పడినట్లయింది. వివాదాస్పద అయోధ్య భూభాగంపై మసీదు నిర్మించాలని ముస్లింలు... రామమందిరం నిర్మించాలి అని హిందువులు మధ్య తలెత్తిన వివాదానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ముగింపు పలికినట్లయింది . ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం కొన్ని దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్న వివాదాస్పద అయోధ్య భూభాగం కేసుపై సంచలన తీర్పును వెలువరించింది. 



 వివాదాస్పద అయోధ్య భూభాగం  తమదేనంటూ ముస్లిం సంస్థలు నిరూపించుకోకపోవడంతో ఈ భూభాగం హిందువులకు సంబంధించిన వ్యాస్ కు  అప్పగిస్తూ సంచలన తీర్పును వెలువరించింది అత్యున్నత ధర్మాసనం. అంతేకాకుండా అయోధ్య లోనే ముస్లింలకు  మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రజలందరూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా  సుప్రీంకోర్టు తీర్పుతో కొన్ని దశాబ్దాల కాలంగా  వివాదాస్పద అయోధ్య భూభాగంలో రామమందిరం నిర్మించాలి అన్న హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ ప్రధాని సహా ప్రముఖులందరూ హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.



 అయితే అయోధ్య తీర్పుపై పోరుగు  దేశం పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆక్రోశం వ్యక్తం చేసింది. భారత్ లో  మైనార్టీలకు భద్రత లేదని సుప్రీం కోర్టు తీర్పు ద్వారా మరోసారి రుజువైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం పేర్కొన్నట్లు సమాచారం. భారత్ ను పూర్తిగా హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది పాకిస్థాన్ విదేశాంగ శాఖ. సంఘ్  పరివార్  తన హిందూత్వ ఎజెండాను అమలు చేసేందుకు... చరిత్రను సైతం తిరగరాస్తుంది అంటూ ఆరోపించింది. వివాదాస్పద అయోధ్య కేసు పై భారత్ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించేందుకు   ఎంచుకున్న సమయం సరికాదంటూ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: