అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డిపై నిందితుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన తరువాత మంటల్లో చిక్కుకున్న ఆమెను తన  ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడే ప్రయత్నాన్ని చేశాడు డ్రైవర్ గురునాథం. విజయారెడ్డి కాపాడే ప్రయత్నం లో తాను మంటల్లో చిక్కుకుని ఆసుపత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు . విజయారెడ్డి వద్ద చాలాకాలంగా డ్రైవర్ గా విధులు నిర్వహిస్తోన్న గురునాథం , తన యజమానిని కాపాడే ప్రయత్నం లో తన ప్రాణాలను కూడా లెక్క చేయకపోవడం  చూసి , అతని విశ్వసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు .


 ఎంతమంది ఇలాంటి వారు ఉంటారని తమలో తామే చర్చించుకుంటున్నారు . గురునాథం మరణం తో ఆ కుటుంబం మాత్రం పెద్ద దిక్కును కోల్పోయింది . గురునాథం కు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు , వారుకూడా పసివాళ్లేనని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. వెనుక , ముందు పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవని అన్నారు . గురునాథం కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు . అయన భార్యకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించి , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని అన్నారు . ఇక గురునాథం కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని రెవిన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది . మొత్తంగా ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసే ప్రయత్నం చేస్తామని వెల్లడించింది .


పలువురు రెవెన్యూ ఉద్యోగులు సైతం వ్యక్తిగతంగా గురునాథం కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేయాలని నిర్ణయించారు . అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు . ఒక ప్రభుత్వ ఉద్యోగిని కాపాడే ప్రయత్నం లో తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా మరణించిన డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న సృహ ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: