ఇటీవల విశాఖ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే... ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి గారిని కలిసి... అన్నా నేను పార్టీలోకి వద్దాం అనుకుంటున్నాను పరిస్థితి ఏంటి ? అని ఆరా తీశారట. దీనికి స్పందించిన మంత్రి గారు ఎందుకు వస్తున్నావని అడిగారట. అనుచరుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆయన సెలవు ఇచ్చారట. అసలు విషయం ఏంటి అనగా... తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఏ వైపు నుంచి చూసినా కనపడటం లేదన్న ఏం చేయమంటారు... ఉన్నప్పుడు పదవి లేదు... పోయినప్పుడు దిక్కు లేద‌ని వాపోయార‌ట‌.


చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఎప్పుడో ఒక పదవి ఇచ్చారు... నాకు ఇంకా ఎలా లేదనుకున్నా ఇంకో 30 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉందన్నా ఏం చేయమంటారు...? అని వివరించారట... సదరు మంత్రిగారు తాను జగన్ కి నీ విషయం చెప్తాను అని ముగించారట. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు... ఉత్తరాంధ్రలో దాదాపుగా ప‌ది మంది మాజీ ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ తమకు ఉన్న పరిచయాల ద్వారా మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి పరిస్థితిని వివరించి.. వైసీపీలోకి వస్తామని చెప్పారట.


మరికొంత మంది అయితే పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా... కొందరు నేతలకు మాత్రమే గుర్తింపు ఉంటుంది, ఒక చోట కాలు నిలవని గంటా లాంటి వాళ్లకు పదవులు ఉంటాయి గాని... మాకు జెండా మోయడమే గాని మరో దిక్కు లేదని అన్నారట. ఇప్పుడు గంటా పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. ఆయన్ను నమ్ముకుని ఉన్నవారికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాదు. ఈ విధంగా ఉత్తరాంధ్ర పార్టీ నేతలు అందరూ కూడా పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నారని, చంద్రబాబు రాజకీయంతో తమకు భవిష్యత్తు కనపడటం లేదని అంటున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: