ఈ  మధ్య కాలంలో టీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విపరీతమైన మాట హెచ్చరికలు భారీగా వస్తున్నాయి అలాంటిదొకటి ఈ  మధ్య వచ్చింది అస్సలేం జరిగిందంటే  చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును  హెచ్చరించారు.ఈ  శనివారం రామకుప్పం మండలంలోని బగళనత్తం, ఉన్సిగానిపల్లి గ్రామాల్లో  ఎంపీ రెడ్డెప్ప పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం హత్యా రాజకీయాల నుంచి  ప్రారంభమైందని,చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ అంటేనే  వెన్నుపోటు రాజకీయాలు  అని చెప్పారు  . అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న ఆయన పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడం ఏమి బాలేదు ఏది ఏలా వుందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
ఎంపీ రెడ్డెప్ప పింగళి దశరథరామయ్య, వంగవీటి మోహనరంగా, మాధవ రెడ్డి, బాలయోగి తదితర రాజకీయ నాయకుల మరణాలకు గల కారణాలను చంద్రబాబు నాయుడు చెప్పాలని  డిమాండ్‌ చేశారు. బాబుకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా ఇంకా  బుద్ధిరాలేదన్నారు.

టీడీపీ సమీక్షా సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, మచ్చలేని మనిషి మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పై విమర్శలు  ఎందుకని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన మంత్రులు, డెప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలపై టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించరని ఎంపీ రెడ్డెప్ప హితవు పలికారు.


జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం జోలికి వస్తే ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని ఎంపీ చంద్రబాబు నాయుడును  హెచ్చరించారు. ఇక పదిరోజుల్లో  ఇసుక సమస్య  పరిష్కారమవుతుందన్నారు,దీని గురించి ఎవ్వరు అధర్యపడకండి  అని చెప్పారు . వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి కుమారుడు భరత్, మండల పార్టీ అధ్యక్షుడు విజలాపురం బాబు రెడ్డి, కో–కన్వీనర్‌ చంద్రారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణా రెడ్డి, మాజీ ఎంపీపీ జయప్ప, సిద్ధప్పపాల్గొన్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: