హైద‌రాబాద్‌ అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా...దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. కొంద‌రు అవినీతి అధికారుల వెన్నులో వ‌ణుకు పుట్టించ‌గా...ఎంద‌రో నిజాయితీప‌రులైన అధికారులు, ఉద్యోగులను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. సామాన్య ప్ర‌జానికాన్ని ఆలోచ‌న‌లో ప‌డేసింది. అయితే, ఎమ్మార్వో విజయారెడ్డి కుటుంబ స‌భ్యులు ఏమ‌నుకుంటున్నారు?  వారి అభిప్రాయాలు ఏంటి అనేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తించిన అంశం. తాజాగా విజయారెడ్డి భ‌ర్త సుభాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....మాట్లాడుతూ...సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చేయని పొరపాటుకు త‌మ కుటుంబ బలయిందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


ఓ వ్యక్తి అనాలోచిత చర్య వల్ల త‌ను, త‌న పిల్ల‌లు బ‌ల‌య్యార‌ని...సురేశ్ క‌న్నీరుమున్నీరు అయ్యారు. `` చేయని పొరపాటుకు మా కుటుంబ బలయింది. కోర్టు ఆదేశాల మేరకు స్టేటస్‌కో ఉన్న స్థలం పై తాసిల్దార్ పట్టా ఇవ్వలేదు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో వందలమందికి ఎమ్మార్వో హోదాలో నా భార్య పాస్‌బుక్‌లు అందించింది, ఎక్కడా అవకతవకలకు పాల్పడలేదు. మాది ఉన్నత కుటుంబం, ఆర్థికంగా బలంగా ఉన్నాం, లంచాలు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. 91 నుంచి 102 వరకు ఉన్న సర్వేనంబర్లలోని భూముల్లో వివాదాలున్నాయనే విషయం నాతో విజయ చెప్పింది. నెలక్రితం టెనెంట్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది, కానీ తాను బదిలీ అవుతున్న సమయంలో దానిలో జోక్యం చేసుకోనని తెలిపింది. ఆమెపై రాజకీయ ఒత్తిళ్లు లేవు. పరిణతిలేని వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకొంటే బాగుంటుంది, విజయారెడ్డి హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. `` అని డిమాండ్ చేశారు. 


కాగా, హ‌త్య చేసిన సురేశ్ స‌తీమ‌ణి త‌మ మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాలు పంచుకున్నారు. ``ఇప్పటికే అప్పుచేసి లక్షల రూపాయలు కట్టాడు. అవి ఎవరికిచ్చాడో తెలియదు. కానీ ఈ భూముల వ్యవహారంలోనే ఎవరికో ఇచ్చింది మాత్రం నిజం. ఎమ్మార్వోపై దాడిచేయాలని వెళ్లలేదని నా భర్త నాతో చెప్పాడు. ఆత్మహత్యాయత్నం చేసి భయపెట్టాలనుకున్నానని.. వినకపోవడంతోనే ఆమెను చంపాలనుకున్నానని దవాఖానలో చెప్పాడు. నా భర్త లాంటి చావు మరే రైతుకు కూడా రావొద్దు.`` అని కోరారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: