ఎన్నికల ముందు పార్టీ లో చేరిన వారికంటే పార్టీని నమ్ముకుని పనిచేసే వారికే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్ కు సానుకూల సంకేతాలు పంపవచ్చునని  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి , వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది . అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపా లో అధికమంది చేరారు . వీరిలో సినీరంగానికి చెందినవారు కూడా ఎక్కువే ఉన్నారు . పార్టీ లో చేరిన సినీ ప్రముఖులు కూడా ప్రభుత్వం లో ఏదోఒక పదవిని వశిస్తున్నవారే కావడం విశేషం .


ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి కోసం పలువురి పేర్లు ప్రముఖంగా విన్పించాయి . ఎన్నికల ముందు పార్టీ లో చేరిన హాస్య నటుడు అలీ , జీవితా రాజశేఖర్, జయసుధ, పోసాని కృష్ణమురళి  ఇలా పలువురి పేర్లు విన్పించగా , ఇక విలక్షణ నటుడు మోహన్ బాబుకు అయితే , ఈ పదవి దక్కినట్లేనన్న ఊహాగానాలు కూడా విన్పించాయి . ఎన్నికల ముంచి పోసాని కృష్ణ మురళి , వైకాపా తరుపున బలమైన గళమే విన్పిచాడు . అలీకి ఇదొక పదవి ఖాయమని పార్టీ వర్గాలు కూడా చెబుతూ వచ్చాయి . కానీ వీరి పేర్లను మాత్రం ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కి జగన్మోహన్ రెడ్డి పరిశీలించినట్లు కూడా లేదని తెలుస్తోంది .


 పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తోన్న సీనియర్ నటుడు విజయ్ చందర్ కు ఈ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం . జగన్ జైలు లో ఉండగా , షర్మిల నిర్వహించిన పాదయాత్ర లో విజయ్ చందర్ చురుకుగా పాల్గొన్నాడు . ఇక తాజాగా జగన్ చేసిన పాదయాత్రలోను ఆయన పాల్గొని , పార్టీకి తన వంతు సేవ అందించాడు .  


మరింత సమాచారం తెలుసుకోండి: