ఈ మధ్య ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఉద్యమం గురించి మనందరికీ తేలిందే,ఆర్టీసీ కార్మికులు సమ్మెను నిర్వహిస్తున్నారు అందుకు బదులుగా  తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక  ఉద్యోగుల్ని నియమించితి తీరా చుస్తే ప్రజలన్నీ  దోచుకునే  దోపిడి దొంగలుగా ఒకపక్క ప్రభుత్వాన్ని  మోసం చేసే రీతిలో తయారయ్యారు.అస్సలు  విషయానికి వస్తే తాత్కాలిక కండక్టర్‌గా పనిచేస్తూ అటు ప్రజలని మరి ప్రభుత్వాన్ని మోసం చేస్తు ఓ వ్యక్తి పట్టుబడ్డారు.

వివరాలు ఈ విధంగా వున్నాయి . శనివారం షాద్‌నగర్‌ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో   ప్రయాణికులకు పాత టికెట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన తాత్కాలిక కండక్టర్‌ ఉదంతం ఒకటి  వెలుగు చూసింది.  ప్రైవేట్‌ కండక్టర్‌ కె.శివకుమార్ ఫరూఖ్‌నగర్‌ మండలం నేరేళ్ళచెరువు గ్రామానికి చెందినవారు , ఈ బస్సుకు శనివారం డ్రైవర్‌ ఎండీ గౌస్‌ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, అనుకోకుండా ఈ బస్సును షాద్‌నగర్‌లో గద్వాల డిపో మేనేజర్‌ మురళీధర్‌రెడ్డి  తనికీ చేశారు. టికెట్ల అమ్మకం ప్రకారం కండక్టర్‌ కె.శివకుమార్‌ క్యాష్‌ బ్యాగ్‌లో రూ.3143 ఉండాలి. కానీ, లెక్కిస్తే రూ .4470 ఉన్నట్లు గుర్తించారు.


అదనంగా ఉన్న డబ్బుల గురించి డిపో మేనేజర్‌ మురళీధర్‌రెడ్డి కండక్టర్‌ను ప్రశ్నించగా అతను సరైన సమాధానం చెప్పడం లేదని డీఎం వివరించారు.దింతో అస్సలు విషయం బయటపడింది ఏమిటంటే  ప్రయాణికులకు టికెట్లు అమ్మిన తర్వాత వాటిని తిరిగి కండక్టర్‌ ప్రయాణికుల నుంచి తీసుకొని బ్యాగులో ఉంచుకున్నట్లు తెలిపారు.


కండక్టర్‌ కె.శివకుమార్‌ పాత టికెట్లను ప్రయాణికులకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తాము గుర్తించామని డీఎం తెలిపారు. ఈ మేరకు శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డిపో మేనేజర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు.  శివకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్‌ కుమార్‌ తెలిపారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: