బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తుపాన్ నిన్న అర్దరాత్రి తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపించే ఈ తుఫాన్‌ ముంచుకొస్తుంది. ఈ తుఫాను పశ్చిమ బెంగాళ్‌-బంగ్లాదేశ్‌ మీదుగా తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర తుఫానుగా మారిన బుల్‌బుల్ తుఫాన్ దాటికి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖకు కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. 

               

అయితే ఈ తుఫాన్ కారణంగా సముద్రంలో అల్లకల్లోలంగా ఉందని, మత్సకారులను వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా  ఈ తుఫాను ప్రభావంతో పారాదీప్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌ ఒడిశా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

                   

కాగా ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా రైతుల పంటలు అన్ని నాశనం అవ్వగా.. ఇప్పుడు మళ్ళి భారీ వర్షాలు పడటం ఆంధ్ర ప్రజలను వణికిస్తోంది. కాగా  పశ్చిమ బెంగాల్‌లో బుల్ బుల్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ ప్రభావంతో దక్షిణ 24పరిగణాల జిల్లాలో ఉద్ధృతంగా గాలులు వీస్తుండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

           

గాలుల హోరుకు పెద్ద పెద్ద చెట్లు, హోర్డింగులు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్నిరకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: