తెలంగాణ ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష నేతల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఫైనల్ చేశారు. పదకొండున ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. 12 వ తేదీ నుండి ఆర్టీసీ జేఏసీ నేతలు ఆమరణ నిరాహాదీక్షకు కూడా దిగనున్నారు. ఛలో ట్యాంక్ బండ్ ప్రశాంతంగా నిర్వహించామని పోలీసులు లాఠీఛార్జ్ ను వారు ఖండించారు.


ఈ నెల 13 న ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు తమ ఉద్యమంలోకి ఇతరులు ప్రవేశించారంటూ చేస్తున్న వ్యాఖ్యలను జేఏసీ నేతలు వాదించారు. ఇదే సమయంలో ప్రభుత్వ మొండి వైఖరిని తప్పుబట్టారు. 11 న హైకోర్టులో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సమావేశంలో అంచనాకు వచ్చారు.


ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలు సమావేశం జరిపారు. ఈ భేటీకి విపక్ష నేతలు భట్టి విక్రమార్క, సంపత్‌, కోదండరామ్‌, వి. హనుమంతరావు, చాడ వెంకట్‌రెడ్డి, విమలక్క, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇంకొంత మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నిన్నటి "చలో ట్యాంక్ బండ్" కార్యక్రమంలో జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు కూడా జరిపారు.


అందులో భాగంగా 11వ తేదీన ప్రజా ప్రతినిధుల నివాసాల వద్ద నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. 12 వ తేదీ నుండి ఆర్టీసీ జేఏసీ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. 13 వ తేదీన జేఏసీ నేతలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఈ నెల 18న "సడక్ బంద్" కు జేఏసీ పిలుపునిచ్చింది. అదే సమయంలో ఛలో ట్యాంక్ బండ్ సమయంలో జరిగిన పరిణామాల పైన జేఏసీ నేతలు సమీక్షా నిర్వహించారు. పోలీసులు చేస్తున్న వ్యాఖ్యలను వీరు ఖండించారు.


తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 37వ రోజుకు చేరింది. నిన్నటి ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చి నిర్వహించిన కార్మికులు ఇవాళ అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపనున్నారు. ఛలో ట్యాంక్ బండ్ నిర్వహణలో భాగంగా పోలీసులను గాయపరిచారనే అభియోగంతో 4 కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో పోలీసుల లాఠీ చార్జ్ లో పలువురు కార్మికులు కూడ గాయపడ్డారు. తన నిరసన కార్యక్రమాల్లో న్యూ డెమోక్రసీ సభ్యులు ప్రవేశించారంటూ పోలీసు అధికారులు చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ నేతలు పూర్తిగా ఖండించారు. ఇదే సమయంలో సోమవారం కోర్టులో జరిగే వాదనలు, నిర్ణయాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ పైన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: