కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం సొంత ఊరు పరమకుడిలో తండ్రి శ్రీనివాసన్‌ శిలావిగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. శుక్రవారం చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో సీనీ పితామహుడు కే.బాలచంద్రర్‌ శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం గాంధీజీ 150 జయంతిని పురష్కరించుకుని కమల్‌ నటించిన 'హేరామ్‌' చిత్రాన్ని రాయపేటలోని సత్యం థియేటర్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు.

అనంతరం కమలహాసన్‌ మీడియాతో మాట్లాడారు. వ్యాపారాన్ని మించి తన జీవిత లక్ష్యం ఏమిటన్నది తాను తెలుసుకుంది.. హేరామ్‌ చిత్ర నిర్మాణ సమయంలోనేనని, రాజకీయాల్లోకి రావాలన్న ఆశ అప్పుడే పుట్టిందని, తన జీవితబాటకు నాంది పడిందని మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధక్షుడు కమలహాసన్‌ పేర్కొన్నారు. 
హేరామ్‌ చిత్రం చేసేటప్పుడు తనకు రాజయకీయ ఆలోచన లేదని, ఆ చిత్రం చూసిన తరువాత రాజకీయాల్లోకి రావాలన్న ఆశ కలిగిందని చెప్పారు. ఆశకు, వ్యాపారానికి మధ్య చాలా తారతమ్యం ఉందన్నారు.

హేరామ్‌ ఆశతో చేశానని, వ్యాపార దృష్టితో చేసుంటే ఈ పాటికి అలాంటివి 50 చిత్రాలు చేసేవాడినని అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ముందు ఇళయరాజాను వద్దనుకున్నామన్నారు. వేరే కొందరిని సంప్రదించామని తెలిపారు. ఇది గాంధీజీ ఇతివృత్తంతో చేసే చిత్రానికి సత్యాగ్రహం చేయాలని భావించి మళ్లీ ఇళయరాజానే ఎంపిక చేశామన్నారు. ఆయన కూతురు, నటి శ్రుతీహాసన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. నాన్న నటుడిగా, రాజకీయనాయకుడిగా ప్రజలందరికీ కనెక్ట్‌ అయ్యారని అన్నారు. ఆయన మనసులో కలిగిన దాన్ని తెలివితో చేస్తారని, చిన్న వయసులో తమను గారాబం చేసేవారు కాదన్నారు.

ఇంటికి ఒక్కో రోజు లేడీ గెటప్‌లోనూ, పులి వేషంలోనూ, ఇండియన్‌ తాతా గెటప్‌ ఇలా పలు వేషాలతో వచ్చేవారని చెప్పారు. అలా ఆయన రావడాన్ని ఆశ్చర్యంగా చూసేవారమని, ఒక రోజు కలైంజర్‌ చిత్ర షూటింగ్‌లో పెద్ద యాక్సిడెంట్‌కు గురయ్యారని తెలిపారు. స్కూల్‌ నుంచి తీసుకొచ్చిన నాన్న మేనేజర్‌ తనకా విషయాన్ని చెప్పడంతో చాలా భయపడ్డానని వివరించారు. ఆస్పత్రిలో స్పృహలేకుండా ఉన్న నాన్న తిరిగి వస్తే సూపర్‌ హీరోనేనని భావించానని, అలాగే ఆయన వీరత్వంతో తిరిగొచ్చారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: