ఏపీలో విపక్ష టిడిపికి వరుస పరంపరలో అదిరిపోయే షాక్ తగిలేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ యేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆరు నెలల్లోనే టిడిపి ఎంత ఘోరంగా దిగజారిపోయిందో చూస్తూనే ఉన్నాం. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు జిల్లా స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం బిజెపి, వైసీపీలోకి వెళుతున్నారు. స్థానికంగా వైసీపీలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఉంటే వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వైపు చూస్తున్నారు. ఇక టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లేందుకు జగన్ సవాలక్ష నిబంధనలు పెడుతుండటంతో ఇప్పుడు వీరికి బిజెపి పెద్ద రాష్ట్రంగా ఉంది.


ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్ చేస్తున్న‌ట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరంతా ఇప్పటికిప్పుడు పార్టీ మారతారా లేదా ? అన్నది మాత్రం కాస్త సస్పెన్స్. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం నలుగురైదుగురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు రెడీ గా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.


టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు నేతృత్వం వ‌హిస్తోన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, విశాఖ, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అనంతపురం జిల్లాలో మరో టీడీపీ ఎమ్మెల్యే  బీజేపీ లో చేరడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం. వీరిలో గంటాతో పాటు విశాఖ నుంచి ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌, గుంటూరు జిల్లా నుంచి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, ప్ర‌కాశం జిల్లా నుంచి క‌ర‌ణం బ‌ల‌రాం పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.


ఇక అనంత‌పురం జిల్లా నుంచి పీఏసీ చైర్మ‌న్‌గా చంద్ర‌బాబుకు ఎంతో న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్న ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్‌కు సైతం బీజేపీ నుంచి భారీ ఆఫ‌ర్ ఉండడంతో ఆయ‌న కూడా పార్టీ మారిపోవ‌చ్చ‌నే అంటున్నారు. అనంత ఎమ్మెల్యే అంటే ప‌య్యావుల కాకుండా హిందూపురంలో బాల‌య్య మాత్ర‌మే ఉన్నారు. బాల‌య్య ఎలాగూ పార్టీ మార‌డు. ఇక ఉన్న‌ది కేశ‌వ్ ఒక్క‌డే కావ‌డంతో కేశ‌వ్ కూడా పార్టీ మారిపోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: