పెళ్లి సందడి మొదలైంది... పెళ్లికూతురు పెళ్లి కొడుకు చేసుకుని ఫంక్షన్ హల్ కి చేరుకొని పెళ్ళికి ముస్తాబవుతున్నారు. పెళ్ళికి వచ్చిన  బంధువులు మిత్రులతో ఫంక్షన్ హల్  మొత్తం నిండి పోయి  సందడి సందడి  నెలకొంది. సమయం దగ్గర పడుతోంది. ఇంకొద్దిసేపట్లో పెళ్లి మొదలవబోతోంది. ఇంతులో  పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది . మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుంది అని అనుకుంటుండగా పెళ్లి కుమారుడు ఫంక్షనల్ లో గదిలోనే ఆత్మహత్య  చేసుకున్నాడు. పెళ్లి కొడుకు ఎంతకీ  రావడం లేదని వెళ్లి చూసిన బంధువులకి పెళ్లి కుమారుడు  ఉరికొయ్యకు వేలాడుతూ విగతజీవుడిగా కనిపించాడు . దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపం లో విషాదం నిండిపోయింది.పెళ్లి కుమారుడి ఆత్మహత్య  ఇరు  కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 



 మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కొంపల్లి లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. బంధువులు మిత్రులతో నిండుగా కనిపిస్తున్న ఫంక్షన్ హల్ లో పెళ్లి కి వచ్చిన వారితో ఫంక్షన్ నిండిపోయి డీజే సౌండ్స్ పాటలతో సందడిగా మారింది .ఇంకొన్ని నిమిషాల్లో పెళ్లి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా తరుణంలో  వరుడు సందీప్ గదిలో ఆత్మహత్య చేసుకొని కనిపించడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. కాగా ఘటనపై  పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెళ్లి కొడుకు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. 



 అయితే పెళ్లి కుమారుడు సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా జరిగిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సందీప్ ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఆత్మ హత్య చేసుకున్నాడా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ పెళ్లి కుమారుడు సందీప్ కి పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పేవాడు కదా... పెళ్లి పీటల వరకు రాణిచ్చే వాడు కదా   అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి . కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా పెళ్లి ఏర్పాటు చేసి పెళ్లి మండపం వద్దకు చేరుకున్నాక  ఇలా ఆత్మహత్యకు పాల్పడడంtho బంధుమిత్రులందరిని  శోకసంద్రంలో ముంచేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లి కుమారుడు సందీప్  ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో విచారిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: