తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 37వ  రోజుకు చేరుకుంది. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు రోజుకు ఉగ్ర రూపం  దాలుస్తుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం దిశగా అడుగు వేయకపోవడంతో... ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసి దిశగా అడుగులు వేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు . ఇప్పటికే చలో  ట్యాంక్ బండ్ కార్యక్రమం పలు ఉద్రిక్త పరిస్థితులకు   దారితీసింది. చలో ట్యాంక్ బండ్   కార్యక్రమం నిర్వహించేందుకు ఆర్టీసీ కార్మిక నేతలు  హైదరాబాద్ పోలీసులు అనుమతి కోరగా పోలీసులు అనుమతి  నిరాకరించారు.కానీ  ఆర్టీసీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా చలో ట్యాంక్ బండ్  కార్యక్రమం నిర్వహించారు. దీంతో నిన్న ట్యాంక్ బండ్ ప్రదేశం మొత్తం రణరంగంగా మారిపోయింది. 



 అయితే చలో ట్యాంక్ బండ్  కార్యక్రమం లో భాగంగా ట్యాంక్ బండ్ పై కి చేరుకున్న ఆర్టీసీ కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎంతో మంది కార్మికులకు గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన కు బయల్దేరిన కార్మికులపై పోలీసులు జులుం  ప్రదర్శించారని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు.చలో ట్యాంక్ బండ్ నిరసన  కార్యక్రమంలో  మావోయిస్టులు కూడా మావోయిస్టులు కూడా పాల్గొన్నారని  హైదరాబాద్ కమిషనర్ అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు అశ్వద్ధామ రెడ్డి . కార్మికులు రాజకీయ పార్టీల కార్యకర్తలు మాత్రమే  పాల్గొనారని అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు కార్మికులపై భాష్ప వాయువు  ఉపయోగించడం వల్ల చాలా మంది కార్మికులు గాయాలపాలయ్యారు అని ఆరోపించారు అశ్వద్ధామ రెడ్డి. 



 కాగా నేడు రాజకీయ పార్టీలతో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ  మరోసారి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. రేపు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ.  అలాగే ఈ నెల  13, 14 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. చలో ట్యాంక్ బండ్  కార్యక్రమంలో ప్రభుత్వం దమనకాండ పై మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేయాలని నిర్ణయించింది ఆర్టీసీ జేఏసీ. ఒక వేళ అవసరమైతే ఢిల్లీలోనే ఒకరోజు దీక్ష నిర్వహిస్తామని జెఎసి నేతలు తెలిపారు. ఏదేమైనా తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసింది ఆర్టీసీ జేఏసీ. చలో ట్యాంక్ బండ్  కార్యక్రమం ద్వారా ఆర్టీసీ జేఏసీ పవరేంటో ప్రభుత్వానికి నిరూపించామని ఇంకొన్ని రోజులు ఇలాగే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే సీఎం కేసీఆర్ దిగిరాక తప్పదు అని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: