తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ  రోజుకు చేరుకుంది. అయితే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై  హైకోర్టులో విచారణలు  కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ విషయంలో పరిష్కారం దిశగా ఆలోచన చేయలేదు..  అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు  ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే  ఆర్టీసీలోని 5,100 రూట్లను  ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఓవైపు ఆర్టీసీ కార్మికులు అందరూ కేసీఆర్ తీరుతో  మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటుంటే... అటు కేసీఆర్ మాత్రం మొండివైఖరి వీడడం  లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోజురోజుకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉగ్రరూపం దాలుస్తోంది. 



 సమ్మె 37 వ రోజుకు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు కేసీఆర్ మాత్రం సమ్మె  విషయంలో సానుకూలంగా స్పందించలేదు. ఆర్టీసీ కార్మికులకు కూడా తమ డిమాండ్ల  పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. కాగా తాజాగా ఆర్టీసీ జేఏసీ నేడు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది. రేపు రాష్ట్రంలోని మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతారని తెలిపింది... నిన్న నిర్వహించిన చలో ట్యాంక్ బండ్  కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులపై కెసిఆర్  వ్యవహరించిన తీరును మానవ హక్కుల కమిషన్కు  ఫిర్యాదు చేస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది.  అంతేకాకుండా ఈ నెల 18న సడక్ బంద్ నిర్వహిస్తామని తెలిపారు.



కాగా  హైకోర్టులో ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే  సుప్రీంకోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు సమాచారం.  కాగా హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సమంజసం కాదంటూ తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు. నిన్న చలో  ట్యాంక్ బండ్  కార్యక్రమానికి ఒక గంట పాటు ఆర్టీసీ కార్మికులకు  అనుమతి ఇస్తే అంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొని గందరగోళం చెలరేగిది కాదని అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. తమ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు రేపు ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగుతారని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 18న సడక్ బంద్ ప్రకటించి కార్మికులపై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలను ఎగ్జిబిషన్ పెట్టి ప్రదర్శిస్తామని అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: