ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీని కోసం అధికారులకు జీవో  కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని పేద విద్యార్థులు అందరికీ మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష ను నిర్వీర్యం చేసినందుకే జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అందుకే అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీలు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 



 ఇప్పటికే దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు... తెలుగు పండితులు కూడా జగన్ సర్కార్ పై మండిపడుతున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ తెలుగు మీడియం నిలిపి వేసేందుకు సన్నాహాలు చేస్తూంటే అధికార భాషా సంఘం ఏం చేస్తుంది  అంటూ పవన్ కళ్యాణ్ నిలదీస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని తప్పుపట్టారు పవన్ కళ్యాణ్. 



 మాతృ భాషను ఎలా కాపాడుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ను చూసి ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి నేర్చుకోవాలి అంటూ వైసీపీ సర్కార్ కు హితవుపలికారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ సంస్కృతిని కెసిఆర్ పరీక్షించుకుంటున్న వైనం  వైసీపీ ప్రభుత్వానికి ఓ పాఠం లాంటిది అని తెలిపారు. 2017 సంవత్సరంలో మాతృభాష మనుగడ కోసం తెలుగు మహాసభల్లో తొలిపొద్దు పేరుతో 442 మంది కవులు రాసిన సినిమాలతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియా ని ప్రవేశ పెట్టాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రోజురోజుకు విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: