తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీల నేతలు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు 'చలో ట్యాంక్ బండ్' ఉద్యమంలో నిన్న భారీ సంఖ్యలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి పోలీస్ నుండి ఎటువంటి అనుమతి రాకపోగా వారి ఉద్యమాన్ని మొదట్లోనే అణిచివేసేందుకు పోలీసు వారు తగిన కసరత్తులు కూడా చేపట్టారు. అందులో భాగంగా పోలీసులు ఉద్రేకం తో రగిలి పోతున్న ఆర్టీసీ కార్మికుల పైన లాఠీఛార్జి చేశారు, బ్యారికేడ్లు పెట్టారు, టియర్ గ్యాస్ వదిలారు ఇంకా చాలా మందిని నగరంలో చాలా చోట్ల అరెస్టు కూడా చేశారు.

ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులను పోలీసు వారు వీధుల్లో తరిమి తరిమి కొట్టారు కూడా. మహిళ ఉద్యమకారులను కూడా లాఠీచార్జ్ చేసిన ఈ దృశ్యంలో చాలా మంది ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైన నెత్తురోడుతూ విపరీతమైన బాధ లో కనిపించడం జనాల మనసులని కలచి వేసిందని చెప్పాలి. కొంతమంది అయితే చేతులు, కాళ్ళు మరియు మొహం నిండా విపరీతమైన గాయాలతో రోడ్ల పైన తిరుగుతూ కనిపించారు. 

ఇకపోతే పోలీసులు గురువారం నుంచే ప్రతి జిల్లాలో వందల మందిని హౌస్ అరెస్ట్ చేసి చలో ట్యాంక్బండ్ జరగకుండా ఉండేందుకు ముందుచూపు చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 5 వేల మందిని రాష్ట్రవ్యాప్తంగా కస్టడీలోకి తీసుకోగా అందులో వరంగల్ అర్బన్ లో 450 మందిని, జంగమ లో 300 మందిని, మహబూబ్ నగర్ లో 245 మందిని వికారాబాద్లో 311 మందిని, రాచకొండ కమిషనరేట్ లో 731 మందిని మరియు సైబరాబాద్ లో 523 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఏది ఏమైనా చివరికి ఆర్టీసీ యూనియన్ లు మరియు ప్రతిపక్ష నేతలు విజయవంతంగా పోలీసువారి 3-టైర్ సెక్యూరిటీని బద్దలు కొట్టుకొని ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. చివరికి వారి త్యాగం ఊరికినే పోకుండా టాంక్ బండ్ వద్ద టిఆర్ఎస్ ప్రభుత్వానికి మరియు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమకారులంతా నినాదాలు చేశారు. ఇంత పెద్ద భారీ రభస జరగడానికి కారణం కెసిఆర్ మరియు అతని ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు అని చెప్పవచ్చు.

టిఆర్ఎస్ ప్రభుత్వం వారు తమ నిర్ణయం సరైనదే అని తలిస్తే ఉద్యమానికి అనుమతులు ఇచ్చి శాంతి పూర్వకంగా ఉద్యమకారులు తమ పనిని చేసుకోకుండా అడ్డుకునేవారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జనాలను అరెస్టు చేయడం మరియు లాఠీచార్జి కి రెండు రోజుల ముందే సన్నాహాలు జరపడం ఎంతటి మూర్ఖపు చర్య అని మానవతావాదుల ఆరోపణ. ఎక్కడ క్షతగాత్రులను అయిన వారందరి పరిస్థితికి కారణం కెసిఆర్ కాదా అని అందరి ప్రశ్న. దీని పై టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి జవాబు ఇస్తుందో చూడాలి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: