టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న జగన్ ప్రభుత్వం పై వైసిపి నేతలపై ఘాటు విమర్శలు చేస్తారనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు పలు అంశాలపై జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు బుద్ధ వెంకన్న. ఇప్పుడు తాజాగా  మరోసారి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సీఎం జగన్ వైసిపి పార్లమెంటరీ  సభ్యుడు విజయసాయిరెడ్డి లను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని శుక్రవారం ముఖ్యమంత్రి అనుకున్నామని... కానీ ఆయన మంగళవారం ముఖ్యమంత్రి అని మీరే ఒప్పుకున్నారని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను మంగళవారం ముఖ్యమంత్రి అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు వ్యగ్యాంగ  విమర్శించారు బుద్ధా  వెంకన్న. 



 ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అంటూ  చెబుతున్నారని... ఇలాంటి దద్దమ్మ కబుర్లు  ఎందుకు అంటూ ఎమ్మెల్సీ బుద్ధా  వెంకన్న ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడాదికి 22 వేల కోట్ల అప్పు చేస్తే.... ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్  మాత్రం 5 నెలలోనే 18వేల కోట్ల అప్పులు  చేశారని ఆరోపించారు బుద్ధ వెంకన్న. అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్ లో 48 వేల కోట్ల అప్పులు ప్రతిపాదించారు అంటూ విమర్శలు  గుప్పించారు. 



 ఎవరు ఎక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారో  ఇప్పుడు చెప్పండి లెక్కల మాస్టారు అంటూ విజయసాయి రెడ్డిపై కూడా వ్యంగ్యాస్త్రాలు  సంధించారు  బుద్ధ వెంకన్న. మీ దొంగ ముఖం చూసి బ్యాంకులు ఛీ  అంటున్నా కూడా సిగ్గు లేకుండా మీ తప్పుడు లెక్కలే నిజం  అంటారా అంటూ విమర్శలు గుప్పించారు. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తలపెట్టిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ని వంకర  రోడ్డు గా మార్చింది మీ మహానేతే విజయసాయి రెడ్డి గారు అంటూ బుద్ధ వెంకన్న విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత మహానేత యువనేత కలిసి మందిమార్బలంతో 5500 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని  ఏకంగా 35 వేల కోట్లకు పెంచి  ఆస్తులు కూడబెట్టుకున్నది  నిజం కాదా అంటూ బుద్ధ వెంకన్న ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: