దాదాపు 130 సంవ‌త్స‌రాలుగా దేశ‌వ్యాప్తంగా ఎన్నో మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణం అవ్వ‌డంతో పాటు ప్ర‌భుత్వాల‌కు సైతం గుదిబండ‌గా మారిన అయోధ్య రామ‌మందిరం విష‌యంలో ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రంజ‌న్ గొగోయ్ శనివారం అయోధ్య కేసు విష‌యంలో చారిత్రాత్మ‌క తీర్పు వెలువ‌రించారు. తీర్పుపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా సున్నీ వ‌క్ఫ్ బోర్డ్‌తో పాటు ఒక‌రిద్ద‌రు ముస్లింలలో చిన్నా చిత‌కా అసంతృప్తులు వ్య‌క్త మ‌వుతున్నాయి.


అయోధ్య కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు అనంతరం దేశమంతా హై అలర్ట్ నెలకొంది. ప్రధానంగా భారత్‌పై అతిపెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వాస్త‌వంగా చూస్తే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అయిన‌ప్ప‌టి నుంచే ఉగ్ర‌మూక‌లు మ‌న‌దేశంలో ప‌లువురు సెల‌బ్రిటీల‌తో పాటు కీల‌క వ్యక్తుల‌ను టార్గెట్‌గా చేసుకుని దాడులు చేసేందుకు ప్ర‌ణాళిక‌ల‌తో ఉన్నారంటూ నిఘావ‌ర్గాలు ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వానికి నివేదించాయి. ఈ లిస్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారో ?  పేర్ల‌తో కూడా పొందు ప‌రిచారు.


ఇక తాజాగా అయోధ్య తీర్పు త‌ర్వాత దేశంలో పెద్ద ఎత్తున దాడుల‌కు పాల్ప‌డేందుకు ఉగ్ర‌మూక‌లు రెడీ అవుతున్నార‌న్న నిఘా వ‌ర్గాల నివేదిక నేప‌థ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. అయోధ్య తీర్పు మరికొన్నిరోజుల్లో వెలువడుతుందన్న వార్తలు ప్రారంభమైనప్పటి నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కదలికలు తీవ్రం అయ్యాయి. ఇప్పుడు తీర్పు కూడా వ‌చ్చేయ‌డంతో పెద్ద ప్ర‌మాదం పొంచి ఉంద‌ని.. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) నిఘా సంస్థలు హెచ్చరించాయి.


టెర్రిస్టులు ప్రధానంగా మూడు రాష్ట్రాలపై నిఘా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై టెర్రరిస్టులు దృష్టి పెట్టాయని సమాచారం. ఏదేమైనా అతి పెద్ద విధ్వంసానికి ఉగ్ర మూక‌లు పెద్ద ప్ర‌ణాళికే వేసిన‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: