ఎన్నో ఆటుపోట్లను మరియు అడ్డంకులను ఎదుర్కొని నిన్న అతి క్లిష్టమైన పరిస్థితులను అధిగమించి మిలియన్ మార్చ్ అంటూ 'ఛలో ట్యాంక్ బండ్' ను విజయవంతం చేసిన ఆర్టీసీ కార్మికులు అదే ఊపులో కెసిఆర్ పై మరొక పోరుకు బాట వేస్తున్నారు. తాజాగా ఆదివారం సమావేశమైన ఆర్టీసి జేఏసి అఖిలపక్ష నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
నిన్న పోలీసులు వారి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు చేసిన పనులు మరియు ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిన తీరు నుండి ఉత్సాహం పొందిన ఆర్టీసీ కార్మికులు మరొక కీలకమైన అడుగు వేయనున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఇదే ఆఖరి మెట్టు కూడా కావచ్చు.

సమ్మె పై సీఎం కేసీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాని నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డితో పాటు కో-కన్వీనర్ రాజిరెడ్డి సహా మరో ఇద్దరు నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. నిన్నటి ఉద్యమం వేడి తగ్గక ముందే ప్రభుత్వం ఊపిరి సలిపేందుకు కూడా వీలు లేకుండా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకి అర్థమవుతుంది. 13న చలో ట్యాంక్ బండ్ లో పోలీసుల దమనకాండ పై మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఆర్టీసి జెఎసి ఫిర్యాదు చేయాలని కూడా రెడీ అయింది.

ఇక పోతే చలో ట్యాంక్బండ్ నిరసనలో ధైర్యంగా పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగాలను మహిళలను అశ్వత్థామ రెడ్డి అభినందించారు. అంతేకాకుండా ఆమరణ నిరాహార దీక్ష తో పాటు లాఠీచార్జిను నిరసిస్తూ 11న మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమని చర్చలకు పిలవకపోతే ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కిస్తామనికి... చివరికి చావడానికైనా తమ సిద్ధమని అశ్వత్థామరెడ్డి చెప్పిన తీరు చూస్తుంటే రానున్న రోజులు తెలంగాణలో ఆసక్తిగా మారనున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: