ఈ రోజుల్లో ప్రేమ జంటలు తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేక ఇష్టం లేని వారితో తమ జీవితాన్ని పంచుకోలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా సాధారణమైన విషయం అయిపోయింది. కులాలు మరియు మతాల పట్ల పట్టుదలగా ఉండే కుటుంబాల వల్ల కొన్నిసార్లు ఇలా జరుగుతుండగా... మరికొందరికి తమ బిడ్డలను ఇచ్చేందుకు సరైన ఉద్యోగం లేదని ఆర్థిక స్తోమత లేదని ప్రేమ వివాహాలను ఒప్పుకోవట్లేదు. అయితే వీటిలో ఏ కారణం అనేది ఇంకా స్పష్టం కాకపోయినా సరిగ్గా తాళి కట్టడానికి అరగంట ముందుగా హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జంటనగరాల ను ఊపేసింది. 

మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి లోని ఒక ఫంక్షన్ హాల్ లో  ఉరి వేసుకున్న తరువాత దొరికిన మృతదేహం పెళ్లి కొడుకు సందీప్ దిగా గుర్తించారు. మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుంది అని అక్కడికి విచ్చేసిన అతిధులు మరియు వధూవరుల రెండు కుటుంబాలు పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. మేకప్ చేసుకుంటానని వెళ్లిన పెళ్ళికొడుకు ఎంత సేపటికి తిరిగి బయటికి రాకపోవడంతో బంధువులు వెళ్లి అతని రూమ్ తలుపు కొట్టారు.

ఎంతసేపటికి అటువైపు నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో చివరికి తలుపుని పగలగొట్టగా అక్కడ సందీప్ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనతో అక్కడికి విచ్చేసిన అతిధులు అంతా షాక్ కి గురి కాగా పెళ్లి పందిరంతా బోసిపోయింది. దిల్షుక్ నగర్ లో నివాసముండే సందీప్ సరిగ్గా 11:35 నిమిషాలకు పెళ్లి చేసుకోవాల్సి ఉండగా ఒక అరగంట ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎందుకు చనిపోయాడు అన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేసి పోలీసులు అతని ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: