రాజ‌కీయాల్లో ఎవ‌రికైనా ఉండాల్సింది న‌మ్మ‌కం. ఇటు ప్ర‌జ‌ల నుంచి, అటు పార్టీలోని కార్య‌క‌ర్త‌లు, నేత‌ల నుంచి కూడా రాజ‌కీయా ల్లో ఉన్న‌వారిపై న‌మ్మ‌కం ఉండాలి. ఆ న‌మ్మ‌క‌మే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కిస్తుంది. ఆ న‌మ్మ‌కమే ప‌ద‌వులు వ‌చ్చేలా చేస్తుం ది. అయితే, ఒక్కొక్క‌సారి నాయ‌కులు వేసే చిందులు వారిపై న‌మ్మ‌కం కోల్పోయేలా చేస్తాయి. కేడ‌ర్ కూడా జెండా మోసేందుకు ముందుకు రాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న వారు నిన్న మొన్న‌టి వ‌ర‌కు పెద్ద‌గా ఉండేవారు కాదు. కానీ, మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, ప‌రిస్థితుల ప్ర‌భావంతో నాయ‌కులు డ‌బుల్ గేమ్ ఆడుతున్నారు. దీంతో న‌మ్మ‌కం పోయి.. కేడ‌ర్ లోనే అస‌హ‌న ప‌రిస్థితుల‌ను చ‌వి చూస్తున్నారు.


క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున గ‌తంలో గెలిచిన టీజీ వెంక‌టేష్ ఫ్యామిలీ రాజ‌కీయాలపై స్థానికం గా విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌తున్నాయి. ప్ర‌స్తుతం టీజీ వెంక‌టేష్‌, ఆయ‌న కుమారుడు ఇద్ద‌రూ చెరో పార్టీలో ఉన్నారు. వాస్త‌వానికి ఆది నుంచి కూడా టీజీ రాజ‌కీయాలు ఏ ఎండ‌కు ఆగొడుగు అనే రేంజ్‌లోనే సాగాయి. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఆయ‌న త‌ర్వాత వైఎస్ హ‌యాం వ‌చ్చే స‌రికి కాంగ్రెస్‌లో చేరిపోయారు. మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. త‌న వ్యాపారాలు, త‌న అవ‌స‌రాలే ప్ర‌మాణంగా రాజ‌కీయాలు చేస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన టీజీ.. మ‌ళ్లీ టీడీపీలోకి వ‌చ్చారు.


ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడ‌య్యారు. నిజానికి అప్ప‌ట్లో టీడీపీలో తీవ్ర‌మైన పోటీ ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న చంద్ర‌బా బును ``మెప్పించార‌ని`` అంటారు. గ‌డిచిన ఐదేళ్లు చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌డంతో ఆయ‌న‌తో కొన‌సాగిన టీజీ నాలుగు మాసాల కింద‌ట బీజేపీలోకి చేరిపోయారు. అయితే, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు టీజీ భ‌ర‌త్‌కు టీడీపీ టికెట్ ఇప్పించుకున్నారు. దీనికి కూడా ఎంతో పోటీ ఉన్నా.. టీడీపీ అధినేత‌, అప్ప‌టి సీఎంను టీజీ మెప్పించారు. అయితే, భ‌ర‌త్ ఓడిపోయారు. ఆ త‌ర్వాత తండ్రి బీజేపీలోనూ, త‌న‌యుడు టీడీపీలోనూ కొన‌సాగుతున్నారు. ఇటీవ‌ల జిల్లాల విస్తృత స్థాయి స‌మావేశానికి గాను విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన భ‌ర‌తను టీడీపీలోని యువ నాయ‌కులు ఆట‌ప‌ట్టించారు.


``నువ్వెప్పుడు కండువా మారుస్తావ్‌`` అంటూ ప్ర‌శ్నించారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఈ తండ్రీ కొడుకులు స‌క్సెస్ కాలేక పోతున్నారు. వ్యాపార రంగంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకే టీజీ బీజేపీలో చేరారనేది బహిరంగ సత్యం. తండ్రీ కొడుకుల ‘డబుల్‌గేమ్‌’తో బీజేపీ, టీడీపీ  ఇద్దరినీ విశ్వసించడం లేదు. బీజేపీలో టీజీ ప‌ట్టు సాధించ‌లేక పోతున్నారు. ఇక, భ‌ర‌త్‌కు కూడా టీడీపీలో ఆశించిన గౌర‌వం ద‌క్క‌డం లేదు. కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌ను లెక్క చేయ‌డం లేదు. దీంతో ఈ తండ్రీ కొడుకుల డ‌బుల్ గేమ్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: