పార్టీ ఏదైనా నాయ‌కుల విధేయ‌త‌కు అధినేత‌లు ఫిదా కావాల్సిందే. ఇప్పుడు ఏపీ అధికార ప‌క్షం వైసీపీలో నూ అదే జ‌రిగింది. పార్టీకి, జ‌గ‌న్‌కు వీర విధేయులుగా ఉంటున్న నాయ‌కుల‌కు జ‌గ‌న్ పెద్ద‌పీట వేస్తున్నారు. వీరిలో ఇప్పుడు నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే, తిరుగులేని నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న కాకాణి గోవ‌ర్ధ‌న్ పేరు చేరింది. రాష్ట్ర శాసనసభ కమిటీల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఆగ్ర తాంబూలం దక్కింది. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వివిధ కమిటీలకు చైర్మన్‌లను, సభ్యులను నియమించారు.


సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్‌గా నియమించారు. అలాగే శాసన సభ రూల్స్‌ కమిటీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని, శాసనసభ పిటిషన్స్‌ కమిటీ సభ్యు డిగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నియమించారు. అలాగే ప్రివిలేజ్‌ కమిటీలో సభ్యుడి గా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వెలగపల్లి వరప్రసాద్‌ను నియమించారు.


అసెంబ్లీ నిర్వహణ, విధివి ధానాల అమలు, సభ్యుల హక్కుల పరిరక్షణలో కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి.  అయితే, ఇటీవ‌ల నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి వ‌ర్సెస్ ఎంపీడీవో వివాదంలో కాకాణి పేరు బాగా విని పించింది. కోటంరెడ్డి టార్గెట్‌గా కాకాణి తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్నార‌ని, కోటంరెడ్డిని డైల్యూట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప్ర‌త్యేకంగా క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో కాకాణిపై తీవ్ర విమ‌ర్శ‌లు చోటు చేసుకు న్నాయి.


దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌క్క‌న పెడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. జ‌గ‌న్ కూడా కోటంరెడ్డిని ప‌క్క‌న పెట్టేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే జ‌గ‌న్ మాత్రం అవేవి ప‌ట్టించుకోలేదు. పార్టీలోను, జ‌గ‌న్ ప‌ట్లా, అటు ప్ర‌జ‌ల ప‌ట్ల కూడా కాకాణి సంపాయించుకున్న పేరు ఆయ‌న‌కు ఇప్పుడు ప‌ద‌విని వ‌రించేలా చేసింద‌ని అంటున్నారు. మొత్తానికి విధేయ‌త‌కు వీర‌తాడు ప‌డింద‌ని, కీల‌క‌మైన ప‌ద‌వి ల‌భించింద‌ని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: