దాదాపు 15 రోజులుగా దేశ రాజ‌కీయాల్లో అంద‌ర‌ని ఎంతో ఉత్కంఠ‌కు గురి చేసిన మ‌హారాష్ట్ర రాజ‌కీయంలో బీజేపీ చేతులు ఎత్తేసింది. 15 రోజులుగా మ‌హా రాజ‌కీయాల్లో రోజుకో ట్విస్ట్ తెర‌మీద‌కు వ‌స్తుండ‌గా... తాజా ట్విస్ట్‌లో బీజేపీ చేతులు ఎత్తేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. త‌మ‌కు స‌రిపడ బ‌లం లేనందున తాము ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేమని గవర్నర్‌కు దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.


ముందుగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఎవ్వ‌రికి స‌రిప‌డా బ‌లం లేక‌పోవ‌డంతో గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న బీజేపీని ప్ర‌భుత్వం ఏర్ప‌టు చేయాల‌ని ఆహ్వానించారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ కోర్ క‌మిటీ భేటీ అయ్యింది. ఇక తాము ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేమ‌న్న విష‌యాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి  ఫడణవీస్‌, భాజపా నేతలు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలు బీజేపీ గెలిచింది.


ఇక్క‌డ ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావల్సిన సంఖ్యాబలం145. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే శివ‌సేన కీల‌క మంత్రి ప‌ద‌వుల‌తో పాటు సీఎం పదవిని 50-50 కాలం పాటు కోరింది. అయితే సీఎం పదవిని శివసేనతో పంచుకునేందుకు బీజేపీ నిరాక‌రించింది. శివసేన మద్దతు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై వెనక్కు తగ్గింది. బీజేపీ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో ఆ పార్టీకి పెద్ద మైన‌స్‌గా మారింది.


ఇక గ‌వ‌ర్న‌ర్ ముందుగా బీజేపీకి ప్ర‌భుత్వ ఏర్పాటు ఛాన్స్ ఇచ్చి సోమవారంలోపు అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని గవర్నర్‌ గడవు విధించారు. దీనిపై ఆదివారం సాయంత్రం ఫడ్నవిస్‌ నివాసంలో భేటీ అయిన బీజేపీ కోర్‌ కమిటీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత  ఉత్కంఠగా మారాయి. ఇక ఇప్పుడు ఎన్సీపీ శివ‌సేన‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అంశంపై స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. అప్ప‌ట‌కీ ప్ర‌భుత్వ ఏర్పాటు సాధ్యం కాక‌పోతే మ‌హారాష్ట్ర‌లో గ‌వ‌ర్న‌ర్ పాల‌నే త‌ప్ప‌నిస‌రి అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: