మహారాష్ట్ర రాజకీయం మరో కీలకమైన మలుపు తీసుకుంది. బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. బీజేపీ పార్టీ ఈ మేరకు తమ నిర్ణయాన్ని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. బీజేపీ పార్టీ గవర్నర్ కు తగినంత సంఖ్యాబలం లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మహారాష్ట్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఈ మేరకు ప్రకటన చేశారు. 
 
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పార్టీ నేతలతో కలిసి మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. ఫడణవీశ్ సరైన మెజారిటీ లేకపోవటం వలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో మహారాష్ట్ర రాజకీయాలపై స్పష్టత వచ్చింది. ఇన్ని రోజుల పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన చిక్కుముడి వీడిపోయింది. 
 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ బీజేపీని కోరటంతో బీజేపీ బృందం గవర్నర్ తో భేటీ అయి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నిర్ణయంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. బీజేపీ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావాలంటే కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరం కాగా మద్ధతు కూడగట్టలేమని భావించటం వలన బీజేపీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఫడణవీస్ శివసేన పార్టీపై ఈరోజు విమర్శల వర్షం కురిపించారు. శివసేన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఠాక్రే నమ్మకద్రోహం చేశారని ఫడణవీస్ మండిపడ్డారు. శివసేన పార్టీ సరైన సంఖ్యాబలం ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఫడణవీస్ అన్నారు. గవర్నర్ బల నిరూపణ చేయాలని సోమవారం వరకు గడువు విధించటంతో బీజేపీ ఈ మేరకు ప్రకటన చేసింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: