అయోధ్య తీర్పు వెలువడింది.  ఈ తీర్పు తరువాత దేశంలో ఎలాంటి గొడవలు రగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేసింది.  ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు.  దేశం మొత్తం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నది.  ఎప్పుడు అలజడులు జరిగే కాశ్మీర్ కూడా చాల ప్రశాంతంగా ఉన్నది.  మొన్న కాశ్మీర్, ఇప్పుడు అయోధ్య తరువాత అటు పాకిస్తాన్ కూడా చాలా కామ్ అయ్యింది.  


ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి సైలెంట్ గా ఉంటోంది. అసలే పాక్ కష్టాల్లో, నష్టాల్లో ఉన్నది.  దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది.  అందుకే పాక్ సైలెంట్ గా ఉన్నది.  నిన్నటి రోజునే కర్తార్ పూర్ కారిడార్ ఓపెన్ చేశారు.  త్వరలోనే ఇండియా నుంచి ఈ కారిడార్ మీదుగా పాక్ లో ఉన్న గురుద్వారా సాహెబ్ కుచేరుకొని గురునానక్ సమాధిని సందర్శించుకుంటారు.  ఇక ఇదిలా ఉంటె, అయోధ్య కేసు తరువాత దేశంలో ఎక్కడ అలజడులు జరగలేదు.  


ఏ రాజకీయ నాయకుడు కూడా దీనిపై వ్యంగ్యంగా మాట్లాడటం కానీ, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కానీ చేయడం లేదు. మరోవైపు ఛానల్స్ లో వచ్చే డిబేటింగ్ పై కూడా దృష్టి పెట్టింది.  డిబేటింగ్ రెచ్చగొట్టే విధంగా ఉంటె, వాటిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయోధ్య తీర్పు విషయంలో ఎవరైనా సరే రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే వారిపై కఠినమైన కేసులు పెట్టాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. 


సోషల్ మీడియాను కంట్రోల్  ఒక టీం ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  ఈ టీమ్ సోషల్ మీడియాలోని విషయాలను ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేస్తున్నది.  అసభ్యకరంగా ఉన్న వాటిని తొలగిస్తోంది.  ఇదిలా ఉంటె, ఇప్పటి వరకు పోలీసులు అయోధ్య విషయంలో రెచ్చగొట్టే విధంగా పోస్టింగులు పెట్టిన 37 మందిపై కేసులు నమోదు చేసింది.  దాదాపుగా 3,217 పోస్టింగ్ లను తొలగించి వారి ప్రొఫైల్స్ ను డిలేట్ చేసినట్టు యూపీ పోలీస్ అధికారులు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: