అయోధ్య తీర్పు.. నిన్నటి నుండి ట్రేండింగ్ టాపిక్ ఇది.. కారణం 15 శతాబ్దాల నుండి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అయోధ్య వివాదానికి నిన్న హైకోర్టులో తెర పడింది. అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం నిన్న కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పుపై పలువురు ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

             

ఈ తీర్పుపై అన్ని వర్గాల నుండి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అయోధ్య తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ అయోధ్య తీర్పుపై స్పందించారు. 

            

ప్రముఖ రచయిత సలీంఖాన్ అయోధ్య తీర్పును స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న భూమిలో మసీదు కాకుండా కాలేజీ కట్టాలని సలహా ఇచ్చారు. ముస్లింలకు మసీదు కన్నా పాఠశాల ఎంతో ముఖ్యమని అయన  అన్నారు. కాగా ఇన్నాళ్లూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తీర్పు రావడం ఎంతో సంతోషంగా ఉందని, తీర్పు వెలువడిన సమయంలో ప్రజలంతా శాంతి, సుహృద్బావంతో ఉన్నారని ఆయన అన్నారు. 

               

నమాజు ఎక్కడైన పరిశుభ్రమైన ప్రదేశంలో చేసుకోవచ్చు అని ముస్లింలకు నాణ్యమైన విద్యకోసం పాఠశాలు, కాలేజీలు చాలా అవసరమని అయన అన్నారు. కాగా సుమారు 22 కోట్లమంది ముస్లింలు నాణ్యమైన విద్యను పొందేలేకపోతున్నారని అయన తెలిపారు. విద్యతో చాలా సమస్యలు పరిష్కారానిచచ్చు అని సలీమ్‌ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: