తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే. కార్మికులతో చర్చలకు కూడా వెళ్లకుండా ఎంత సేపు వారిని భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని కెసిఆర్ భావించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆర్టీసీ ముగిసిన అధ్యాయమని హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాల అనంతరం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.


ఇక ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం దాదాపు 40 రోజులకు చేరుకోవడం, శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో ఈ సమస్య తెలంగాణ ఉద్యమం తరహాలో ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. శనివారం జరిగిన నిరసన కార్యక్రమాలతో అటు విపక్షాలు కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి. రాజకీయంగా బలంగా ఉన్న కెసిఆర్ ఉద్యమం విషయంలో ముందు నుంచి చర్చలకు వెళ్లవద్దనే భావనలో ఉండి దారిలోకి కార్మికులు రాకపోతే మాత్రం 5000 రూట్లలో తాను ప్రయివేట్ బస్సులు ప్రవేశ పెడతాన‌ని చెప్పారు.


దీని ద్వారా కార్మికుల‌కు పరోక్ష హెచ్చరికలు చేసే ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. ఇక ఈ సమ్మె విషయంలో సోమవారం హైకోర్టు లో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉంది... కార్మికులకు తాము అందిస్తున్న సౌకర్యాల గురించి కోర్ట్ ముందు పెట్టడమే కాదు ఆర్టీసీ గతాన్ని కూడా వివరించి కోర్టు ముందు పెట్టాలని భావిస్తోంది. ఇక వారి సమ్మె కారణంగా సామాన్యులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూపించేందుకు కొన్ని సాక్ష్యాలను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.


ఒకవేళ హైకోర్టు లో తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే మాత్రం సుప్రీం కోర్ట్ కి వెళ్ళడానికి కూడా కెసిఆర్ సర్కార్ సిద్ధంగా ఉంది. జేఏసీ ఇప్పటికే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి నవంబర్ 12 నుంచి ఆమరణ దీక్షలకు దిగనున్నట్లు ప్రకటించింది. దీనితో ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: