తహసిల్దార్ షేక్ హసీనా కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలు జిల్లా గూడూరు తహసిల్దార్ షేక్ హసీనా లంచం డిమాండ్ కేసులో అడ్డంగా దొరికిపోయారు. సురేష్ అనే వ్యక్తి నుంచి గూడూరు తహసిల్దార్ షేక్ హసీనా 4 లక్షలు లంచం డిమాండ్ చేయగా... లంచం తీసుకునే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించారు. నాలుగు లక్షలు డిమాండ్ చేయడంతో ఏం చేయాలో పాలుపోని సురేష్ అనే వ్యక్తి వెంటనే ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సురేష్ కి నాలుగు లక్షల డబ్బులు ఇచ్చి పంపగా... లంచం తీసుకునే విషయంలో చాలా  తెలివి గా వ్యవహరించారు తహసిల్దార్ షేక్ హసీనా. సురేష్ తెచ్చిన నాలుగు లక్షల డబ్బును తాను స్వయంగా తీసుకోకుండా... తనకి  నమ్మకస్తుడైన భాష అనే వ్యక్తి వేరేచోట ఉంటాడని అతనికి డబ్బు ఇవ్వాలంటూ సురేష్ కి చెప్పింది. 



 అయితే అంతకు ముందుగానే ఏసీబీని ఆశ్రయించిన సురేష్ అనే వ్యక్తి తహసిల్దార్ షేక్ హసీనా చెప్పినట్లుగానే ఆమెకు నమ్మకస్తుడైన భాష అనే వ్యక్తికి లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తాసిల్దార్ హసీనా పరారయ్యారు. అప్పటి నుంచి పోలీసులు హసీనా  కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. కాగా  షేక్ హసీనా ఇంకా పరారీలోనే  లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె కోసం పోలీసులు వేట కొనసాగుతుండగా తహసిల్దార్ హసీనా ను   పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గూడూరు తహసిల్దార్ షేక్ హసీనా పై ఇప్పటికే లంచం డిమాండ్ కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. 



 కాగా  ఏసీబీ అధికారుల విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. గూడూరు తహసిల్దార్ షేక్ హసీనా  కర్నూలు బి సి క్యాంపు లోని ఏడు హాస్టళ్లలో రూములు  తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. అంతేకాకుండా తహసిల్దార్  తీసుకున్న 7 రూమ్ లకు  కూడా అద్దె  చెల్లిస్తున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. హాస్టల్లో తహసిల్దార్ హసీనా 7 రూములు  ఎందుకు తీసుకుంది  అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై ఏసీబీ అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. కాగా పరారీలో హసీనాకు ఎవరైనా   ఆశ్రయం కల్పిస్తే  వారి పైన కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా గూడూరు తహసిల్దార్ షేక్ హసీనా బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు  పోలీసులు. ఒకవేళ హసీనా  తమ ఇంటికి వస్తే తప్పకుండా సమాచారం అందించాలని అంటూ చెబుతున్నారు పోలీసులు .


మరింత సమాచారం తెలుసుకోండి: