ఇంటర్నెట్ లో ప్రతిరోజు ఎన్నో చిత్ర విచిత్రమైన విషయాలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. అవి ఎంతో విచిత్రమైతే కానీ ప్రపంచం మొత్తం తెలియదు. తాజాగా అలాంటి ఎంతో విచిత్రమైన మనిషి మొహం తో పోలిన ఓ కుక్క నెట్టింట వైరల్ అయినా విషయం విదితమే. దానిని మర్చిపోయే లోపే మళ్ళీ ఇంకో జీవి అచ్చు మనిషి ముఖ పోలికలతో కనిపించి ఇంటర్నెట్ లో సంచలం రేపుతోంది. 


వివరాల్లోకి వెళితే .... ఒక వింతైన మనిషి ముఖాన్ని పోలిన చేపని ఎవరో గుర్తుతెలియని టూరిస్ట్ అమ్మాయి చైనాలోని మియావో అనే గ్రామంలోని ఒక సరస్సులో ఈతకొడుతుండగా వీడియో తీసింది. మొట్ట మొదటిగా ఆమె ఈ సరస్సు చేప వీడియో ని చైనీస్ సోషల్ మీడియా విబోలో పోస్ట్ చేసింది. దాని తర్వాత ట్విట్టర్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ఫేసుబుక్ సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేయబడింది. అప్పటినుంచి ఈ అరుదైన చేప ఇంటర్నెట్ లో పెద్ద సంచలనమే అవుతుంది. 


చేప ను చూస్తే భయమేస్తుందని, దీన్ని తినాలంటే ధైర్యం ఉండాలంటూ నెటిజెన్ల తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు దీన్ని ఏలియన్ చేప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చేప ముఖంపై మనిషి కళ్ళ వంటి రెండు నల్లటి మచ్చలు, మనిషి ముక్కులాంటి మరో రెండు నల్లటి నిలువటి చారలు, మనిషి నోరు లాగా ఇంకో నల్లటి చార ఉండడంతో అచ్చం మనిషిలాగానే కనిపిస్తుంది. 


ఇలాంటి చేప కనిపించడం మూడోసారి. 2010 లో బ్రెండన్ అనే వ్యక్తి మనిషి ముఖం లాంటి చేపని పట్టుకున్నాడు. దాని ధర 40 వేల యూరోలు. 2009 లో కూడా ఇలాంటి చేపనే దక్షిణ కొరియా లో దొరికింది. దాని పొడవు 3 అడుగుల. ఆశ్చర్యమేమిటంటే ఇప్పటి వరకు విచిత్రంగా కనిపించిన జంతువులలో 90% సముద్రంలో నివశించేవే.


మరింత సమాచారం తెలుసుకోండి: