ఆర్టీసీ కార్మికులు నిన్నటి రోజున ట్యాంక్ బండ్ పై మిలీనియం మార్చ్ ను చేపట్టిన సంగతి తెలిసిందే.  ఈ మార్చ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.  వేలాది మంది కార్మికులు ట్యాంక్ బండ్ పై నడిచేందుకు వచ్చారు.  కానీ, పోలీసులు వీరిని అడ్డుకోవడంతో కథ రణరంగంగా మారింది. భారికేడ్లు పెట్టి అడ్డుకోవాలని చూసినా సరే అడ్డుకోలేకపోయారు.  పోలీసులు ఎంతగా ప్రయత్నం చేసినా... అడ్డుకోలేకపోయారు.  ఆ సమయంలో జరిగిన లాఠీ ఛార్జ్ లో చాలామంది ఆర్టీసీ కార్మికులు గాయపడ్డారు.  


దీంతో పోలీసులు ఆర్టీసీ కార్మికులతో పాటు మావోయిస్టులు ఈ మార్చ్ లో పాల్గొనేందుకు వచ్చారని, అందుకోసమే లాఠీ ఛార్జి చేసినట్టు తెలిపారు.  దీనిపై ఆర్టీసీ జేఏసీ స్పందించింది.  ప్రభుత్వం విరుద్దమైన, అసత్యపు ప్రకటనలు చేస్తోందని మండిపడింది.  మార్చ్ లో పాల్గొన్నది కార్మికులు మాత్రమే అని, మావోలు కాదని జేఏసీ నేతలు అంటున్నారు.  ఇదిలా ఉంటె, ఆర్టీసీ జేఏసీ తన తదుపరి కార్యాచరణను ప్రకటించింది.  


నవంబర్ 12 వ తేదీ నుంచి  ఆర్టీసీ జేఏసీ నేతలు నిరాహార దీక్షలు చేయబోతున్నట్టు జేఏసీ ప్రకటించింది.   నలుగురు జేఏసీ నేతలు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటారని చెప్పింది.  అలానే, . 18న జైల్‌ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.  తమ దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు.  కోర్టు సూచన మేరకు వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.  హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం కేసీఆర్ అనడం సమంజసం కాదని, దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరుతున్నారు.  ఒకవేళ కోర్టు తీర్పు జేఏసీకి అనుకూలంగా వస్తే.. సుప్రీం కోర్టులో ప్రభుత్వం కేసు దాఖలు చేస్తుంది.  ఒకవేళ విచారణకు తీసుకొని తీసుకొని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తే... ఉద్యోగులు ఇబ్బందులు పడినట్టే అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: