సమాజంలో మనిషి మనిషిగా బ్రతకడం మరచిపోతున్నట్టున్నాడు.. కనీసం ఒక మనిషికి పుట్టాననే ఆలోచన కూడ అతని బుద్దికి తట్టడం లేదు అందుకే ఊహించని విధంగా జీవిస్తున్నాడు. లేకపోతే లోకజ్ఞానం కూడ సరిగ్గా తెలియని పసిపిల్లల మీద తన ప్రతాపాన్ని చూపడమేంటి? తుచ్చమైన కోరికల కోసం వారి బాల్యాన్ని దానితోపాటే జీవితాన్ని బలి చేయడం దేనికి? ఇలాంటి అధికారాన్ని ఈ మృగాలకు ఎవరిచ్చారు.


ఇలాంటి తప్పుడు పనిచేసే వెధవల్ని ఎంత కఠినంగా శిక్షించిన పాపం అనరాదు. ఈ విషయంలో చట్టం మాత్రం జాలి లేకుండా ప్రవర్తించాలని సామాజిక వేత్తలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. బాలల హక్కుల చట్టాలు ఇంకా కఠినంగా మార్చి జీవితంలో తప్పు చేయాలనే ఆలోచన వస్తే వణికిపోయేలా కచ్చితంగా అమలుచేయాలి. అప్పుడుగాని కొంత వరకైనా ఇలాంటి దాడులు తగ్గుతాయేమో. ఇకపోతే చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.


ఈకేసులో అనుమానితుడిగా కనిపించిన ఓ వ్యక్తిని పెద్దతిప్ప సముద్రంలో అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాంతోపాటు చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇక ఈ సంఘటన పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తీవ్రంగా స్పందించారు.


ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన తనను కలచివేసిందని సీఎం అన్నారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా మృగంలా మారిన ఇటువంటి వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన సృష్టం చేశారు. ఇకపోతే పోస్టు మార్టం నివేదికలో చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని వెల్లడించింది. నిజంగా జగతి మొత్తం జేజేలు పలుకుతున్న మన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు నిత్యం జరగడం విషాదకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: