ఈరోజుల్లో మన తెలుగు తో పాటు ఇంగ్లీష్,,,హిందీ రెండు కూడా చాలా ప్రాముఖ్యం...ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అనే ఆలోచనతో ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది పెద్దలు ఎందుకు అడ్డు చెపుతున్నారు.ఎంతో మంది తల్లి తండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం లో చేర్చలేక తమ స్తోమత లేనందువలన అశలు చంపుకుని ఐతే ప్రభుత్వ బడుల్లో లేదా పనికి పంపుతున్నారు.

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటే బడుగు బలహీన వర్గాలకు.... ఇంకా  అట్టడుగు అన్ని వర్గాల పేదలకు చాలా ఉపయోగం ఉంటుందని భావించి జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం పాఠశాలలను కూడా కొనసాగించాలి మరికొందరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఏ‌పి లో ప్రభుత్వ-ప్రవైట్ బడులలో చదివే వారు 30:70 ఉండొచ్చు. ప్రవైట్ బడులలో చదివే 70% లో ఒక 10% తెలుగు మీడియం లో ఉండొచ్చు.

అంటే, ఈ 40% లో ఒక 20% మాత్రమే స్వచ్చందంగానో, ఇంగ్లిష్ మీడియం లో నెగ్గుకురాలేకనో తెలుగు మీడియం ఉంటారు..మిగిలిన అంతా ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియం కు అనుకూలురే. కాబట్టి, ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ మీడియం పెట్టటం వలన, ఎంతో కొంత పేద ప్రజలకు ఉపయోగం, మద్యతరగతి వారికి ఊరట. కాకపోతే, తెలుగును ఖచ్చితమైన సబ్జెక్ట్ గా ఉంచటం మంచిదని భావిస్తున్నారు.


మరి అలాంటప్పుడు, ఇక తెలుగు బాషకు కొత్తగా వచ్చే చేటేమిటి? కాబట్టి ప్రజల కోరిక మేరకే ఏపీలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారని అన్నారు అధికారభాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తెలుగుమాధ్యమంలో చదువుకునేందుకు ఎవరైనా ముందుకువస్తే.. తెలుగుమీడియాన్ని కూడా కొనసాగించాలని సీఎం జగన్‌ను కోరుతానని చెప్పారు యార్లగడ్డ. తెలుగును ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టడం వల్ల భాషకు మేలే జరుగుతుందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: