కాశ్మీర్ లోని పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై పాక్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసిన ఘటనలో దాదాపుగా 40 మంది వరకు సైనికులు మరణించారు.  దీనికి పాక్ ఉగ్రవాదులులే కారణం అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు.  పుల్వామా దాడి జరిగిన కొన్ని రోజులకే ఇండియా వైమానిక దళం మిరాజ్ 2000 విమానాలతో బాలాకోట్ లో తిష్ట వేసిన ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.  ఈ దాడుల్లో పాక్ ఉగ్రవాదులు మరణించారు. 


అర్ధరాత్రి జరిగిన ఈ వైమానిక దాడి మరుసటి రోజున పాక్ ఎఫ్ 16 విమానాలతో ఇండియాపై దాడులు చేయాలనీ చూసింది.  మిగ్ 29 విమానంతో అభినందన్ పాక్ కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని కూలగొట్టాడు.  ఈ దాడిలో అభినందన్ మిగ్ 29 విమానం కూలిపోయింది.  విషయం ఏమిటంటే.. మిగ్ విమానం కూలిన తరువాత అభినందన్ పారాచూట్ సహాయంతో కిందకు దిగాడు.  అయితే, అప్పటికే అభినందన్ దిగింది ఇండియాలో కాదు..పాక్ లో అని తెలుసుకున్నాడు.  అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు.  


సైన్యం అతన్ని సైనిక స్థావరానికి తీసుకెళ్లి విచారించింది.  మూడు రోజుల విచారణ అనంతరం అభినందన్ ను విడుదల చేసింది.  ఈ విచారణ సమయంలో అభినందన్ ఇండియాకు సంబంధిచిన ఎలాంటి సమాచారాన్ని పాక్ కనిపెట్టలేకపోయింది.  మరోవైపు అంతర్జాతీయంగా ఇండియా అభినందన్ విషయంలో దౌత్యపరమైన ఒత్తిడిని తీసుకురావడంతో పాక్ కు మరోగతి లేక వదిలిపెట్టింది.  పాక్ చెరలో చిక్కి సజీవంగా ఇండియాకు తిరిగి వచ్చిన అభినందన్ కు ఇండియా మొత్తం ఘానస్వాగతం పలికింది.  


ఇక ఇదిలా ఉంటె, కరాచీలోని వైమానిక దళ స్థావర మ్యూజియంలో అభినందన్ విగ్రహాన్ని పెట్టింది.  ఎందుకు ఆ విగ్రహాన్ని పెట్టిందో ఇప్పటికి తెలియడం లేదు.  అతని విగ్రహంతో పాటు అతను వేసుకున్న దుస్తులను పోలిన దుస్తులను కూడా మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టింది. అతను అక్కడ ఉన్నప్పుడు తాగిన టీ కప్పును కూడా మ్యూజియంలో పెట్టింది.  ఇండియాకు చెందిన సైనికుడిని పట్టుకున్నామని భవిష్యత్తులో చెప్పుకోవడానికి అలా చేసిందో లేదంటే.. రహస్యాలను పట్టుకోవడానికి వింగ్ కమాండర్ ను ప్రశ్నించగా.. అయన ఎలాంటి సమాధానం చెప్పకుండా ధైర్యంగా ఉన్నందుకు.. ఆ ధైర్యానికి మెచ్చుకొని అలా పెట్టిందో తెలియదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: