దాదాపుగా 134 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య వివాదానికి సంబంధించిన తీర్పు తాజాగా వెలువడింది.  నవంబర్ 9 వ తేదీన ఈ తీర్పును వెలువరించారు.  ఈ తీర్పుపై ఇండియాలోని ముస్లింలతో సహా ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తున్నారు. కానీ, పాక్ మాత్రం ఈ తీర్పుపై మండిపడింది.  కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభిస్తున్న సమయంలో ఇండియాలో ఇలాంటి తీర్పు వెలువడించడం బాధాకరమైన విషయం అని పాక్ విదేశాంగశాఖ మంత్రి ఖురేషి పేర్కొన్నారు.  


పాక్ లో మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం కర్తార్ పూర్ కారిడార్ వంటివి ప్రారంభిస్తుంటే.. ఇండియాలో మాత్రం మైనారిటీలకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.  ఇప్పటికే కాశ్మీర్ విషయంలో ముస్లింలు బాధతో ఉన్నారని, ముస్లింలకు కాశ్మీర్ విషయంలో అన్యాయం జరిగిందని అన్న ఖురేషి, ఇప్పుడు అయోధ్య తీర్పుతో ముస్లింలను మరింత బాధలోకి నెట్టారని చెప్పారు.  


ఈ తీర్పును మరికొన్ని రోజుల తరువాత వెలువరిస్తే ఏమౌతుందని ప్రశ్నించారు. పాక్ నుంచి ఎలాంటి మాటలు వస్తాయో తెలిసిందే కదా.  పాక్ ఎప్పుడు కూడా ఇండియాకు అనుకూలంగా మాట్లాడిందని ఇప్పుడు సరిగ్గా మాట్లాడటానికి చెప్పండి.  ఇండియా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకిస్తూనే ఉంటుంది.  ఇండియా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.  ఇండియా ఎప్పుడు పాక్ అంతర్గత విషయాల్లో తలదూర్చలేదు.  


ఒకవేళ ఇండియా అలా కనుక తలదూర్చే విషయమే అయితే.. పాక్ పరిస్థితి ఏంటో అందరికి అర్ధం అవుతుంది.  పాక్ ఇప్పుడు ఉన్నట్టుగా కూడా ఉండదు.  పీవోకేను ఇండియా ఎప్పుడో తిరిగి ఆక్రమించుకునేది.  ఇప్పుడు ఇండియా నెక్స్ట్ టార్గెట్ అదే కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.  త్వరలోనే పీవోకేను ఇండియా కైవసం చేసుకుంటుంది.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  మరి చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: