అయోధ్య వివాదంపై ఫైనల్ తీర్పు నిన్నటి రోజున వెలువడింది.  ఈ తీర్పు వెలువడిన తరువాత దీనిపై పెద్దగా ఎవరూ కూడా కామెంట్స్ చేయలేదు.  సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఎవరు స్పందించలేదు.  అటు టీవీ మీడియాలో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉండడంతో ఆచితూచి దీనిపై డిబేటింగ్ లు పెట్టారు.  హద్దు మించి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు ఉన్న సంగతి తెలిసిందే.  


ఈ నేపథ్యంలో ఎవరూ కూడా పెద్దగా దీనిపై స్పందకపోవడం విశేహం.  ఒకవేళ తీర్పుపై అసంతృప్తితో ఉన్నా.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు తిరుగులేదు కాబట్టి.. దీనిపై ఇంకెక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కేసు గురించి ఇంతటితో మర్చిపోతే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు.  ముగిసిన అధ్యాయంగా దాన్ని అభివర్ణిస్తున్నారు. ఇకపై దానిపై కామెంట్స్ చేయకుండా ఉంటె బాగుంటుంది.  


ఇక ఇదిలా ఉంటె, ఈ తీర్పు వెలువడిన మరుసటి రోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇంట్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి హిందూ, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు.  దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు.  తీర్పు తరువాత సంయమనం పాటించిన దేశంలోని అందరికి మతపెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.  అయితే, రాబోయే కాలంలో దీనిని అడ్డుగా పెట్టుకొని దేశంలో అలజడులు జరిగినా జరగొచ్చని, జాగ్రత్తగా ఉండాలని వారు అజిత్ దోవల్ కు చెప్పారు.  


సున్నితమైన అంశం కాబట్టి దీని ప్రభావం భవిష్యత్తులో ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు.  ఇక దేశంలో శాంతిభద్రతల కోసం తమవంతు సహకారం కేంద్రప్రభుత్వానికి అందజేస్తామని మతపెద్దలు చెప్పడం విశేషం. ఈ సమావేశానికి హిందూ సంఘాల నుంచి 18 మంది ప్రతినిధులు, ముస్లిం సంఘాల నుంచి 12 మంది ప్రతినిధులు హాజరయ్యారు.హిందూ ప్రతినిధులుగా అవధీశానంద స్వామీజీ, స్వామీ పరమార్థానంద, పేజావర్ పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ తదితరులు హాజరుకాగా, ముస్లిం సమాజం నుంచి మౌలానా ఆజాద్ యూనివర్శిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ అఖ్త్రుల్ వసే, నవీద్ హమీద్, మౌలానా సయీద్ అహ్మద్ నూరీతో పాటు మరికొందరు హాజరయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: