జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన 'అరవింద సమేత' సినిమాలో ఫ్యాక్షన్ నేపథ్యాన్ని త్రివిక్రమ్ బాగా లోతుగా చూపించారు. అందులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన వివాదం కాస్తా రెండు ఊర్ల గొడవగా మారి చాలా మందిని పొట్టన పెట్టుకుంది. అసలు ఆ గొడవ మొదలు కావడానికి కారణం ఐదు రూపాయలు అన్న విషయం కూడా ప్రేక్షకులని బాగా అబ్బురపరిచింది. ఇలాగే నిజజీవితంలో కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపడే వారందరికీ ఈ ఉదంతమే ఒక ఉదాహరణ. 

కేవలం రెండు రూపాయలు మనిషి ప్రాణాలు తీసేలా చేశాయి. ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సంచలనం సృష్టించింది. కాకినాడ రూరల్ మండలం వలసపాక లో జరిగిన దారుణ హత్యలో సువర్ణ రాజు అనే వ్యక్తి తన సైకిల్ లో గాలి నింపుకునేందుకు అప్పలరాజు అనే వ్యక్తి యొక్క సైకిల్ రిపేర్ షాప్ కు వచ్చాడు. సువర్ణ రాజు సైకిల్ లో గాలి నింపిన అప్పలరాజు ప్రతిగా రెండు రూపాయలు ఇవ్వాలని కోరాడు. దానికి నన్నే డబ్బులు అడుగుతావా అని సువర్ణ రాజు కోపంగా గద్దించాడు.

అది కాస్తా తీవ్రవాదానికి దారితీసింది. గొడవ చాలా పెద్దదిగా మారగా కోపం తో ఊగిపోయిన సువర్ణ రాజు అప్పలరాజు పై దాడి చేశాడు. దీంతో కోపంతో అప్పలరాజు అక్కడే ఉన్న కత్తిని తీసి సువర్ణ రాజు ని పోటీ చేశాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన సువర్ణ రాజును స్థానికులు వెంటనే కాకినాడ జి.జి.హెచ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రూపాయల చిల్లర గొడవ కాస్తా పెద్దగి గా మారి ఒక మనిషి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం అప్పలరాజు పరారీలో ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: