ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న అయోధ్య కేసు వ్యవహారంలో సుప్రీం ఎట్టకేలకు నిన్న తీర్పును ఇచ్చింది. అయితే ఈ తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చింది. అయితే ఇది వరకూ అయోధ్యపై తొమ్మిదేళ్ల కిందటే హై కోర్టు తీర్పు వచ్చింది.  అప్పుడు వచ్చిన తీర్పకు భిన్నంగా సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా న్యాయపరమైన పోరాటానికి ఆస్కారం కొంత వరకూ ఉందని స్పష్టం అవుతోంది. అదే రివ్యూ పిటిషన్. ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా ఒక పిటిషన్ దాఖలు చేయవచ్చని న్యాయనిపుణులు అంటున్నాయి.అయోధ్య పిటిషనర్లలో హిందూవాదులు తీర్పు పట్ల సంతోషంగా ఉన్నారు. వారు కోరుకున్నది జరిగింది. కాబట్టి వారు రివ్యూ పిటిషన్ దాఖలు చేయరని స్పష్టం అవుతోంది.


అయితే కొంత మంది ముస్లిం లు మాత్రం రివ్యూ పిటిషన్ వేయొచ్చనే అవకాశం కనిపిస్తుంది.  వారిలో కొందరు వచ్చిన తీర్పుతో సంతోషంగా ఉన్నామని అంటున్నారు. ఇన్నేళ్ల న్యాయపరమైన పోరాటాన్ని ఆపేయనున్నట్టుగా ప్రకటించారు. మరి కొందరు మాత్రం ఇంకా తాము తీర్పును  సమీక్షించుకోవాల్సిందిగా ప్రకటించారు. ఒకరు మాత్రం రివ్యూ దాఖలు చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు.ముస్లింల తరఫున కూడా పలువురు పిటిషనర్లున్నారు.  వారు అలా భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.


దీనితో మళ్ళీ సుప్రీం కోర్టుకు ముస్లిం వర్గాలు వెళతాయా .. అన్న సందేహం వస్తుంది. అయితే కోర్ట్ రివ్యూ పిటిషన్ ను ఆహ్వానించే అవకాశం తక్కువగా ఉందని చెప్పాలి. కొందరు ఇక చాలన్నట్టుగా వ్యవహరిస్తుంటే ఇంకొందరు మాత్రం మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ రివ్యూ పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు తీసుకుంటుందా? ధర్మాసనం తీర్పును స్టే ఇస్తుందా? అనేది మాత్రం ఇప్పుడప్పుడేతేలే  అంశం కాకపోవచ్చు. అంత వరకూ ధర్మాసనం ఇచ్చే తీర్పే ఫైనల్ అనేది మాత్రం ఖాయమే అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: