అక్టోబర్ 24 తరువాత మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.  మహాపీఠం కోసం బీజేపీ, శివసేన పార్టీల మధ్య వార్ జరగడంతో.. శివసేన బీజేపీ తో అన్ని బంధాలను తెగతెంపులు చేసుకుంది.  శివసేనకు కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం.  దానికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు రెడీగా ఉన్నది.  30 ఏళ్లుగా కలిసున్నా బంధాన్ని ఒక్కసరిగా సేన తెగతెంపులు చేసుకోవడంతో ఆ పార్టీ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. 


మరాఠా రాజకీయాల్లో దూకుడు ఎప్పుడు పనికిరాదు.  ఎన్డీయేలో ఉంటూనే శివసేన గతంలో బీజేపీపై ఒంటికాలిపై విరుచుకుపడింది.  ఒంటికాలిపై విరుచుకుపడినా.. పెద్దగా లాభం లేదు.  2019 ఎన్నికల తరువాత శివసేన ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంది.  ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలి.  అదొక్కటే శివసేన ముందున్న లక్ష్యం.  దానికోసమే పోరాటం చేస్తున్నది.  


ఇందులో భాగంగానే శివసేన అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది.  కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా శివసేన కలిసి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది.  కాంగ్రెస్, ఎన్సీపీలో తలపండిపోయిన నేతలు ఉన్నారు.  ఒకసారి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఆ కూటమిలో చేరితే... కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితి వస్తుంది.  


శివసేన అనుకున్నట్టుగా అక్కడ పనులు జరుగుతాయి అనుకుంటే పొరపాటే.. కాంగ్రెస్ ప్రతి సొంతలాభం కోసమే ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది.  స్వలాభం ముందు.. తరువాతే వేరేది అని ఆలోచిస్తుంది.  అలాంటిది శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఎలా ఇస్తుంది.  ఒకవేళ ఒకే చెప్పినా.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చివర్లో ఇస్తే ఇవ్వొచ్చు.  ఈలోగా ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు.  గంటకో విధంగా పరిణామాలు మారిపోతున్న తరుణంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో మరికొన్ని గంటలల్లోనే తేలిపోతుంది.  మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. దాని ఫలితం ఎలా ఉంటుంది ఓటర్లకు త్వరలోనే తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: