మనిషి తనను తాను జయించుకున్నాడనుకుంటున్నాడు. కాని అవివేకంతో మాట్లాడుతున్నాడనుకోవడం లేదు. అభివృద్దివైపు పరుగులు తీస్తూ ప్రకృతిని సైతం జయించానని భ్రమపడుతున్నాడు. కాని ఏనాటికి ఇది జరగని పని. ఎంతగా టెక్నాలజీ అభివృద్ది జరిగిన ప్రకృతి వైపరిత్యాలను తట్టుకోవడం అనేది అసాధ్యం. దానికి నిదర్శనం అప్పుడప్పుడు విరుచుకు పడే తుఫానులే. ఇకపోతే బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను బుల్‌బుల్.. శనివారం అర్ధరాత్రి బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది.


ఈ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తూ ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. ఇక సాగర్ ఐలాండ్ వద్ద శనివారం రాత్రి 11.30 తర్వాత తీరం దాటిన బుల్‌బుల్ తుఫాను ఈశాన్యదిశలో బంగ్లాదేశ్‌వైపు ప్రయాణించి తీరం దాటుతూ క్రమంగా బలహీనపడింది అని అనుకున్న సమయానికి తీరానికి చేరువైన తర్వాత వాయుగుండంగా మారి ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌‌లో బీభత్సం సృష్టింస్తోంది.


ఇకపోతే సౌత్ 24 పరగణాస్ జిల్లాలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచగా. తుఫాన్ ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. సముద్రంలో 2 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి..బెంగాల్‌లో  ఈ తుఫాన్ ప్రభావంతో ఇప్పటి వరకు 9మందికి పైగా మరణించినట్లు , 4లక్షల మందిపై దీని ప్రభావం ఉండే అవకాశం వుందంటు.  అధికారులు వెల్లడించారు. ఒడిశాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కరిశాయని తెలిపారు.


దీని కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. తుఫాను ప్రభావం కారణంగా పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మూసివేశారు. ఇకపోతే బుల్‌బుల్ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందని ఐఎండీ తొలుత అంచనా వేయడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురయ్యింది. వరి పంట కోతకు వచ్చే సయమంలో తుఫాను రూపంలో ముప్పు పొంచి ఉందని తెలిసిన రైతుల గుండెలు గుభేలుమన్నాయి. కానీ , తుఫాను ప్రభావం అంతగా చూపకపోవడంతో రైతులు కాస్త కుదటపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: