ఆడ పిల్లలకు కనీస రక్షణ కూడా దొర‌క‌డం క‌ష్ట‌మైపోయింది ప్ర‌స్తుత సొసైటీలోని ప‌రిస్థితులు. చిన్నారిపై అత్యాచారం సంఘటన. సరైన చట్టాలు రూపొందించి నేరస్తులకు కఠిన శిక్ష వేసి శిక్షించడంలో ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమవ్వటమే కారణం అనేలా ఉన్నాయి జరుగుతున్న అఘాయిత్యాలు. నెలల పసికందు నుండి 90 ఏళ్ల వృధ్దురాలు వరకు ఎవ్వరికి రక్షణ లేకుండా ఉన్న ఈ భారతా వనిలో అభివృద్ధి మంత్రం జపిస్తున్న ప్రభుత్వాలు..ముందు దేశ మహిళలకు కనీస భద్రత కల్పించడంలో చొరవచూపితే బావుంటుంది.


 చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం గుట్టపాళ్యం గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసు తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. చిన్నారి వర్షితపై అత్యాచారం చేసిన హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.


 కల్యాణ మండపం సమీపంలో జరిగిన వర్షిత హత్యపై ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం నివేదిక వివరాలను వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఊపిరాడకుండా చేశార‌ని దానివల్లనే వర్షిత మరణించిందని పోలీసులు నిర్ధారించారు.  ఈ మేర‌కు గురువారం రాత్రి వివాహానికి వెళ్ళిన ఆగంత‌కుడు ఓసారి పెళ్లి కొడుకు తరఫు బంధువునని, మరోసారి పెళ్లి కూతురు...తరఫు మనిషినని పొంతన లేకుండా చెప్పాడని, మరి కొందరితో పెళ్లి బస్సు సిబ్బందికి చెందినవాడినని చెప్పాడని...వర్షిత కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీంతో అతనే హంతకుడై ఉంటాడని అనుమానిస్తున్నారు. ...


కల్యాణమండపంలో తిరుగాడిన హంతకుడి ఆనవాళ్లను సీసీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు అతన్ని కర్ణాటకకి చెందిన వాడిగా గుర్తించారు. దీంతో అతని సమాచారం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, కోలార్, కేజీఎఫ్ జిల్లాల్లోని డీసీఆర్ బీల నుంచి వివ‌రాలు సేక‌రిస్తున్నారు. హంతకుడిని ప‌ట్టుకోవ‌డం కోసం ప్ర‌త్యేకంగా మూడు ప్ర‌త్యేక టీమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇక‌పోతే స‌మాజం అస‌లు ఎటువైపు పోతుంది. అభంశుభం ఎరుగని ప‌సికందుల‌తో అంత క‌ర్కాశ‌కులుగా ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు అన్న‌ది ఇప్ప‌టికీ చాలా మందికి అర్ధం కావ‌డంలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: