బాలల చలన చిత్రోత్సవం ఎన్నో సంవత్సరాల నుండి హైదరాబాద్ లో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ బాలల చలన చిత్రోత్సవం 1979 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తుంది. అయితే ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్ ఒక్కోసారి ఒక్కో నగరాన్ని ఎంచుకుంటుంది. 

                      

అయితే హైదరాబాద్ కు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే ఉద్దేశంతో 2003 లో హైదరాబాద్ లో జరగగా ఇంకా అప్పటి నుండి హైదరాబాద్ ఏ శాశ్వత వేదికగా అయ్యింది. అయితే అప్పటి నుండి రెండేళ్లకు ఒకసారి హైదరాబాద్ లో ఈ వేడుక జరుగుతూ వచ్చింది. ఈ వేడుకకు ప్రపంచ ప్రసిద్ధ సినీ టెక్నిషియన్లు అందరూ హాజరవుతారు. 

                      

అంతర్జాతీయ మీడియా నుండి ఈ వేడుకకు కవరేజి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా 2015, 2017లో ఈ చిత్రోత్సవాలు జరిగాయి. కానీ ఈ ఏడాది మాత్రం తమకు ఆర్ధిక స్థోమత లేదని ప్రభుత్వం చెప్పడంతో ఈ వేడుక కాస్త వేరే నగరానికి వెళ్ళింది. అయితే ఈ వేడుకతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్ధికంగా వెనక ఉన్నామని తేల్చి చెప్పింది. 


కాగా బాలల చలన చిత్రోత్సవంకు రాష్ట్ర ప్రభుత్వం అంత డబ్బు కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కేంద్రం వాటా కూడా ఇందులో ఉంటుంది. అయితే ఈ వేడుక నిర్వహించడానికి ఆ మాత్రం కూడా ఖర్చు చెయ్యలేనంత దీనస్థితిలో తెలంగాణ ఆర్ధిక పరిస్థితి ఉందా ? అనే అనుమానం కలిగేలా తెలంగాణ సర్కార్ ప్రవర్తించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: