గతంలో ఏ ప్రభుత్వంలోను లేని విధంగా హై కోర్టు ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వాన్ని హైకోర్టు అమ్మనాబూతులు తిట్టినట్లు ఎప్పుడూ తిట్టలేదు. విచారణ ఎప్పుడు జరిగినా ఉన్నతాధికారులను పోలీసు ఇంటరాగేషన్ చేసినట్లుగా వాయించేస్తోంది.

 

సమ్మె నేపధ్యంలో ఆర్టీసీ లాభనష్టాలు, ఆదాయాలు, ఖర్చులు అన్నీ కోర్టు ముందు విచారణకు వస్తున్నాయి. విచారణలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ పూర్తిగా అబద్ధాలే అని అందరికీ తెలిసిపోతోంది.  ఆదాయాలు, ఖర్చులపై రకరకాల లెక్కలు కోర్టు ముందుకొస్తుండటంతో న్యాయమూర్తికి మండిపోతోంది.

 

ఆర్టీసీ లెక్కల విషయంలో విచిత్రమేమిటంటే ఆర్టీసీ ఇన్చార్జి ఎండి ఓ లెక్క చెబుతున్నారు. రవాణాశాఖ కార్యదర్శి చెబుతున్న లెక్కలు మరో రకంగా ఉంటోంది. ఆర్టీసీ యూనియన్ నేతలు సమర్పించిన లెక్కలు ఇంకో విధంగా ఉంది.  మొత్తానికి ఒక్కొక్కరు ఒక్కో విధమైన లెక్కలు ఇవ్వటంతో న్యాయమూర్తికే పిచ్చెక్కిపోయింది. దాంతో వరసబెట్టి అందరినీ కోర్టుకు పిలిపించి వాయించేస్తున్నారు.

 

ప్రభుత్వం తరపున కోర్టులో లెక్కలు చూపించాల్సిన శాఖలే ఒక్కో విధంగా ఎందుకు చూపుతున్నాయి. ఎందుకంటే  కేసియార్ ఆదేశాలు లేకుండా జరగదు. కేసియార్ ఆదేశాలతోనే ఒక్కో శాఖ ఒక్కో విధమైన లెక్కలు ఇస్తున్నట్లు అర్ధమైపోతోంది. లెక్కలతో కోర్టును కన్ఫ్యూజ్ చేయాలన్న కేసియార్ ఉద్దేశ్యం అర్ధమైపోతోంది. అందుకనే కోర్టు కూడా చాలా ఘాటుగా వాయించేసింది.

  

గతంలో ఆర్టీసీలో  ఇన్నిరోజుల పాటు సమ్మె జరిగిన దాఖలాలు లేవనే చెప్పాలి. విచారణ సందర్భంగా కోర్టు 11వ తేదీ డెడ్ లైన్ గా విధించింది. 11వ తేదీలోగా సమ్మె విషయంలో ప్రభుత్వం ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని తీవ్రంగా హెచ్చరించింది. కానీ కేసియార్ ఆ హెచ్చరికలను లెక్క చేసినట్లు కనబడటం లేదు. అందుకనే యూనియన్ నేతలతోను, కోర్టుతోను, కేంద్రప్రభుత్వంతో కూడా ఘర్షణ ధోరణిని అవలంభిస్తున్నారు. అంటే కేసియార్ వైఖరి చూస్తుంటే సమ్మె ముగింపుకు తనవైపు నుండి  చర్యలు తీసుకునే ఆలోచన లేదని తెలిసిపోతోంది. మరి సోమవారం నాడు సమ్మెను విచారించనున్న కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: