ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రతిపక్ష నాయకులూ ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోకుండా అతని పని అతను చేసుకుంటూ ఆంధ్ర ప్రజల ముఖాలలో చిరునవ్వులు పూయిస్తున్నాడు సీఎం జగన్. 

                         

పుట్టిన పాప నుండి వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరి కోసం సంక్షేమ పథకాలను విడుదల చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు మరో శుభవార్త అందించనున్నారూ సీఎం జగన్. కేవలం నాలుగు నెలలోనే 4లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన సీఎం జగన్ ఇప్పుడు మరో నోటిఫికేషన్ విడుదల చెయ్యనున్నారు. 

                            

అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అటవీశాఖలో దాదాపు 2500 పోస్టులు భర్తీ చేయనున్నట్టు 2020 జనవరిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. అటవీ శాఖలో సిబ్బంది కొరత అధిగమించేందుకు నియామకాలు చేపడుతున్నట్టు తెలిపారు. 

                       

విశాఖ కంబాలకొండలో జరిగిన ఏపీ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి బాలినేని. స్మగ్లర్ వీరప్పన్ చేతిలో మృతి చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి శ్రీనివాస్‌తో పాటు పలువురు అమర వీరులకి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పలు విషయాలు మీడియాతో మాట్లాడిన మంత్రి అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2500 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: