బీజేపీ ప్రముఖ నేత, ఈ రోజు దేశాన్ని ఏలే అవకాశం కాషాయ జెండాకు కల్పించిన మూల పురుషుడు లాల్ క్రిష్ణ అద్వానీకి కఠిన కారాగాస వాసం తప్పదా. మొన్ననే తొంబై రెండేళ్ళను పూర్తి చేసుకుని 93లోకి  అడుగుపెట్టిన అద్వానీని ఇపుడు గతం వెంటాడుతోంది. ఆయన కష్ట‌పడి నిర్మించిన పార్టీ అధికారంలో ఉంది. దాని ఫలాలు ఆయన పూర్తిగా అస్వాదించలేదు. ఆయన రాజకీయం నీతి నియమాల పునాదుల మీద నడిచింది


తాజాగా జరిగిన 2019 ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయకుండా ఆయన  పూర్తిగా  క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన శిష్యుడు మోడీ ప్రధానిగా ఉండగా ఆయనకు రాష్ట్రపతి పదవి కూడా దక్కలేదు, ఇపుడు అవసాన దశలో ఆయనకు జైలు  జీవితం కూడా ప్రాప్తించే దుర్బర పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదెలాగంటే అయోధ్యలో రామాలయం కట్టుకోమని తీర్పు చెప్పిన సుప్రీం కోర్టే బాబ్రీ మసీద్ కూల్చివేతను గట్టిగా  తప్పుపట్టింది. అలా చేయకూడదు, చేసి ఇస్లామిక్ మూలాలను నిర్మూలించాలని ప్రయత్నించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక మరో వైపు బాబ్రీ మసీద్ కూల్చివేత  విషయంలో సీబీఐ విచారణ మరింత జోరందుకోనుందని అంటున్నారు. ఈ కేసులో నిందితుల్లో కొందరు మరణించారు. బతికున్న వారిలో మురళీ మనోజర్ జోషి, ఉమాభారతి వంటి వారు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఉన్నారు. వీరంతా కూడా ఇపుడు సీబీఐ చార్జిషీట్లో ప్రధాన నిందితులు. 


ఈ కేసు తుది విచారణ ఊపందుకున్న క్రమంలో  సుప్రీం కోర్టు బాబ్రీ మసీద్ కూల్చివేతపై చేసిన ఘాటు వ్యాఖ్యల పర్యవసానంగా సీబీఐ ఇపుడు  గట్టిగా పట్టు బిగిస్తుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో అద్వాని తదితరులకు జైలు శిక్ష తప్పకపోవచ్చునని అంటున్న్నారు. అయోధ్య సమస్యతో, రాముల వారి మందిరం కోసం పోరాడిన అద్వాని చివరికి ప్రధాని కూడా కాలేకపోయారు. కానీ ఆయన నేరస్థుడు అంటున్నారు. మరో వైపు తాను రామ మందిరం ఉద్యమంలో పాలుపంచుకోవడం గర్వకారణం అని అద్వానీ అన్నారు. మరి ఈ కేసులో ఎన్ని మలుపులు ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: