దేశంలో కాంగ్రెస్ విముక్త భారత్ ని అమలు చేయాలని, బీజేపీనే ఏకైక పార్టీగా నిలపాలని ఓ వైపు మోడీ, అమిత్ షా విశ్వప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. జాతీయంగా చూసుకుంటే మోడీ బెటర్ అంటున్న జనం లోకల్ పాలిటిక్స్ కి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలను ఎన్నుకుంటున్నారు. ఆ విధంగానే హర్యానాలో జేజేపీ ప్రాంతీయ పార్టీ పుంజుకుంది. దాంతో బీజేపీ జత కట్టాల్సివచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ కూడా బాగా స్కోర్ చేసింది.


ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో మరో  ప్రాంతీయ పార్టీ  శివసేన జోరు చూపిస్తోంది. ఇక ఇక్కడ కూడా  కాంగ్రెస్ కి మంచి రోజులు వస్తున్నాయిలా సీన్ కనిపిస్తోంది. శివసేన బీజీపీ కూటమి వదిలేసి   బయటకు వచ్చి మద్దతు కోరడం అంటే అధికారంలో భాగం కోరి ఇవ్వడమే. ఇది కాంగ్రెస్ వూహించని పరిణామమే. ఇక మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా కాంగ్రెస్ ఉప ఎన్నికలు ఎక్కువగా గెలుచుకుని గట్టిగా నిలబడింది. అదే సమయంలో రాజషాన్, మధ్యప్రదేశ్ లలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది.


మరో వైపు కర్నాటకలో గద్దె దిగినా కూడా గట్టి ఫోర్స్ గా  కాంగ్రెస్  ఉంది. తెలంగాణాలో ఇప్పటికీ టీయారెస్ కి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కి నెహ్రూ కుటుంబం నుంచి వారసులు వస్తే మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని అంతా భావిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తూంటే ప్రియాంకా గాంధీకి ప్రెసిడెంట్ కిరీటం పెట్టే దిశగా సాగుతున్నాయని అంటున్నారు. రాహుల్ గాంధీ కాడి వదిలేశారు, సోనియాగాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రియాంక గాంధీ రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. దాంతో కాంగ్రెస్ కొత్త అధినేత్రిగా ఆమె ఉండడమే బెటర్ అని కరణ్ సింగ్, వీరప్పమొయిలీ లాంటి సీనియర్ నాయకులు  భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే కొద్ది  నెలల్లోనే ప్రీయాంకాకు పట్టాభిషేకం జరిగే అవకాశలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: