ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఆ తరువాత 1,26,728 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. 
 
ఏపీ ప్రభుత్వం అటవీశాఖలో ఖాళీగా ఉన్న 2,500 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి నెలలో 2,500 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అటవీ శాఖలో సిబ్బంది కొరతను అధిగమించటం కొరకు ఖాళీగా ఉన్న 2,500 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిన్న ఏపీ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం విశాఖ జిల్లా కంబాడకొండలో జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మంత్రి బాలినేని మాట్లాడుతూ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ తో పాటు పలువురు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అటవీ అధికారులకు కొత్త వాహనాలు 2020 జనవరి నాటికి సమకూరుస్తామని మంత్రి తెలిపారు. ఆధునాతన ఆయుధాలను సమకూరుస్తున్నామని అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
పూర్తి స్థాయిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అటవీశాఖ పిసిసిఎఫ్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ సిబ్బందికి ఎర్ర చందనం అక్రమ రవాణా ప్రాంతంలో ఆధునిక ఆయుధాలను సమకూర్చామని తెలిపారు. జనవరి నెలలో అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. 33 శాతం అడవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రదీప్ కుమార్ తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: