మహారాష్ట్ర రాజకీయం ఎన్నో మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని భారతీయ జనతాపార్టీ చేతులెత్తేయడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు వంతు శివసేనకు దక్కింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో శివసేనను పార్టీ ఏర్పాటు చేసే అంశంలో మీ అభిప్రాయం చెప్పాలంటూ గవర్నర్ శివసేనకు సందేశం పంపించారు.


ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతోంది. అటు ఎన్సీపీ శివసేనకు మద్దతు ఇస్తామని క్లారిటీగా చెప్పడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించిన తర్వాతే క్లారిటీ ఇస్తామని శరద్ పవార్ ప్రకటించారు. దీంతో మహా రాజకీయం మహా రంజుగా సాగుతోంది.


అంతకుముందు.. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ ఆదివారం రోజంతా సమాలోచనలు జరిపింది. మిత్రపక్షం శివసేన తనతో కలిసి రావడం లేదని ఆరోపించిన ఆ పార్టీ తగినంత సంఖ్యాబలం లేని కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు తెలియజేసింది. మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం రాజ్ భవన్ లో గవర్నర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేసింది.


శివసేన తమకు మద్దతివ్వడం లేదన్న మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రజల తీర్పును శివసేన అగౌరవపరిచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ -ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన భావిస్తే ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన, ఇతర పార్టీలు కలిసి మహకూటమిగా ఏర్పడ్డాయని.. ఈ కూటమి ఎన్నికల ముందే ఏర్పడిందని.. దీనికి ప్రజలు మద్దతు ఉందని ఆయన అన్నారు.


ప్రజా తీర్పును నిరాకరిస్తూ... కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన అయిష్టత వ్యక్తం చేసిందని ఆయన ఆరోపించారు. మరి ఇప్పుడు శివసేన ఎలా మద్దతు సమీకరించు కుంటుందన్నది ఆసక్తి కరంగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: